ఉత్సాహంగా జూనియర్‌ కబడ్డీ సెలక్షన్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా జూనియర్‌ కబడ్డీ సెలక్షన్స్‌

Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM

ఒంగోలు సిటీ: ఒంగోలు నగరంలోని డాక్టర్‌ పి.ఆనంద్‌ మినీ స్టేడియంలో శుక్రవారం జూనియర్‌ బాలురు, బాలికల కబడ్డీ సెలక్షన్స్‌ ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సెలక్షన్స్‌కు కబడ్డీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కొర్రా భాస్కర్‌రావు, సెక్రటరీ వై.పూర్ణచంద్రరావు, చైర్మన్‌ చంద్రమోహన్‌ రెడ్డి, ట్రెజరర్‌ డీ రమేష్‌ హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు. సెలక్షన్స్‌లో పలువురు జూనియర్‌ బాలురు, బాలికలు పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. క్రీడాకారుల ఆటతీరు, ప్రతిభ, ఫిట్‌నెస్‌ను పరిశీలించి ప్రతిభావంతులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, కబడ్డీ కోచ్‌లు, నిర్వాహకులు, క్రీడా అధికారులు, క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement