న్యూస్‌రీల్
మూడు దశాబ్దాలుగా పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఒకవైపు నీళ్లు వదిలేందుకు సమాయత్తమవుతుండగా. మరోవైపు అదే ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితుల గుండెల్లో మాత్రం గుబులు రేగుతోంది. ప్రాజెక్టు కోసం పుట్టిన ఊరును.. పూర్వీకుల జ్ఞాపకాలను.. సాగు భూములను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వారిని కన్నీటి పర్యంతం చేస్తోంది. ప్రాజెక్టు పూర్తయి నీళ్లు అందితే పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారమైనట్లే. కానీ ఆ నీళ్ల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయం జరిగితేనే ఆ విజయానికి సార్థకత ఉంటుందని బాధితులు చెబుతున్నారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందే మిగిలిన నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి.. పరిహారం, పునరావాసం అందించి.. ఒక్క కుటుంబం కూడా అన్యాయానికి గురికాకుండా చూడాలని కోరుతున్నారు.
సామాన్లు సర్దుకుని ఆటోల్లో, ట్రాక్టర్లలో
వస్తున్న నిర్వాసితులు


