పుట్టిన గడ్డను వదిలి వెళ్లడం అంత తేలిక కాదు. గొట్టిపడియ, అక్కచెరువుతాండ, కలనూతల, గుండంచర్ల, సుంకేసుల గ్రామాలకు చెందిన పలువురు నిర్వాసితులు చివరిసారిగా తమ పూర్వీకుల సమాధులను సందర్శించారు. పూజలు చేసి.. పూలు సమర్పించి.. కన్నీళ్లతో మొక్కుకున్నారు. తాతలు, ముత్తాతల జ్ఞాపకాలను మదిలో పదిలం చేసుకుని భారమైన హృదయాలతో స్వగ్రామాలకు వీడ్కోలు పలికారు. తరతరాల అనుబంధానికి తాళం వేస్తూ.. ఇళ్లకు తాళాలు వేసి కొత్త ప్రాంతాల బాట పడుతున్నారు. ఒకవైపు వెలిగొండ నీటితో పశ్చిమ ప్రాంతం పచ్చబడుతుందన్న ఆనందం.. మరోవైపు అదే ప్రాజెక్టు కోసం తమ ఊరును కోల్పోతున్నామన్న వేదన వారిని వెంటాడుతోంది.


