ముంపు నిర్వాసితులకు సచివాలయాల్లో పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ముంపు నిర్వాసితులకు సచివాలయాల్లో పెన్షన్‌

Aug 29 2026 1:52 AM | Updated on Aug 29 2026 1:52 AM

ముంపు నిర్వాసితులకు సచివాలయాల్లో పెన్షన్‌ శాస్త్రోక్తంగా విఖనస జయంతి వేడుకలు ఫీడర్‌ కెనాల్‌ను పరిశీలించిన మంత్రుల బృందం

మార్కాపురం టౌన్‌: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు మార్కాపురం మండలంలో వారికి కేటాయించిన స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో సెప్టెంబరు 1వ తేదీన పెన్షన్‌ పొందవచ్చని డీఆర్‌డీఏ డైరెక్టరు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కలనూతల, గుండంచర్ల, కాటంరాజు తాండ గ్రామాల వారికి దేవరాజుగట్టులోని స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో , సుంకేశుల గ్రామం వారికి పుచ్చకాయలపల్లి కార్యాలయంలో, గొట్టిపడియ, అక్కచెరువు తాండ గ్రామాల వారికి కోలభీమునిపాడు గ్రామ కార్యాలయంలో, శ్రీరాం నగర్‌ వారికి కాకర్ల గ్రామ కార్యాలయంలో, లక్ష్మీపురం, కృష్ణానగర్‌, రామలింగేశ్వరపురం వారికి మాగుటూరు గ్రామ కార్యాలయంలో సెప్టెంబరు 1వ తేదీన పెన్షన్‌ పంపిణీ చేస్తారని తెలిపారు. ముంపు గ్రామాల లబ్ధిదారులు తమకు కేటాయించిన స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో పెన్షన్‌ తీసుకోవాలన్నారు.

ఒంగోలు మెట్రో: శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని విఖనస జయంతిగా జరుపుకోవటం సాంప్రదాయం. విఖనస మహర్షి జయంతిని ఒంగోలు బైపాస్‌ రోడ్డు వద్ద వైఖానస సంఘ భవనంలో శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు విఖనస మహర్షికి అభిషేక కై ంకర్యం భక్తిశ్రద్ధలతో చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రావణ ఉపాకర్మల కార్యక్రమం శాస్త్రోక్తంగా సాగింది. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు పరాంకుశం కేశవాచార్యులు, ప్రధాన కార్యదర్శి పీఎంకే ఆత్రేయ, ఏ.వి.నారాయణ దీక్షితులు, డాక్టర్‌ హరిబాబు, డాక్టర్‌ గంజాం రామకృష్ణ, పరాంకుశం కృష్ణసాయి, ముపాళ్ల రాంబాబు, దివి కళ్యాణ్‌ చక్రవర్తి, అధిక సంఖ్యలో వైఖానస ప్రముఖులు పాల్గొన్నారు.

పెద్దదోర్నాల: ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌లు ఫీడర్‌ కెనాల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు గంటవానిపల్లెలో ఏర్పాటు చేసిన రెగ్యులేటర్‌ను పరిశీలించారు. దీంతో పాటు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement