జెడ్పీ స్థాయి సంఘ సమావేశం
ఒంగోలు సిటీ: జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలు జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. జెడ్పీ కార్యాలయంలో సీఈఓ చిరంజీవి అధ్యక్షత వహించారు. 5వ స్థాయి సంఘం సీ్త్ర, శిశు సంక్షేమశాఖ స్థాయి సంఘానికి మారెడ్డి అరుణకుమారి అధ్యక్షత వహించారు. 2వ స్థాయి సంఘమైన గ్రామీణాభివృద్ధి శాఖ పై సమీక్షించేందుకు మూడు జిల్లాలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. 3వ స్థాయి సంఘమైన వ్యవసాయం, 4వ స్థాయి సంఘమైన విద్య, వైద్యం, ఆర్ధిక విషయాలపై సమీక్ష నిర్వహించారు. పై విషయాలపై మూడు జిల్లాలకు సంబంధించిన అధికారులు హాజరై సమాచారం ఇచ్చారని సీఈఓ తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీలు పాల్గొన్నారు.
● డీఈఓ సీవీ రేణుక
ఒంగోలు సిటీ: 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని సంతనూతలపాడు, గణపవరం, అమ్మనబ్రోలు గురుకుల విద్యాలయాల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. డీఈఓ కార్యాలయంలో శనివారం గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం వాల్‌పోస్టర్‌ను డీఈఓ రేణుక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీఆర్‌ఎస్ క్యాట్–2026, రాష్ట్రంలోని 7 జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి, ఒక డిగ్రీ కళాశాల (బాలుర, నాగార్జునసాగర్) మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 తుది గడువు అని తెలిపారు. ఏపీఆర్‌ఎస్ క్యాట్–2026 పరీక్ష ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఏపీఆర్‌జేసీ అండ్ డీసీ సెట్–2026 పరీక్ష ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జిల్లా కేంద్రాల్లో జరుగుతుందని తెలిపారు. వివరాలకు 87126 25043, 87126 25044 నంబర్లను సంప్రదించాలని కోరారు.
జెడ్పీ స్థాయి సంఘ సమావేశం


