
రెండు కాళ్లూ పనిచేయవు
నా రెండు కాళ్లు పనిచేయవు. పక్షవాతం కూడా వచ్చింది. ఒకరి సాయం లేకుండా ఎక్కడికి వెళ్లలేను. వికలాంగత్వం తక్కువగా ఉందని నా పింఛన్ తొలగించామని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మళ్లీ అప్పీల్ చేసుకోమంటున్నారు. కొండపి ఆస్పత్రికి ఆటోలో వెళ్లాలంటే రూ.2 వేలు ఖర్చవుతుంది. ఆటోలో కొండపి వెళుతుంటే సగం దూరం వెళ్లాక సచివాలయ సిబ్బంది ఫోన్ చేసి డాక్టర్ లేరని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– కుంచాల సుజాత, డ్రైవర్‌పేట రెండో లైను, సింగరాయకొండః