
దివ్యాంగుల పెన్షన్ వెరి‘పీకేశన్’..!
పింఛను తొలగించి నోటికాడ ముద్ద లాగేసిన సర్కారు
సదరం వెరిఫికేషన్‌లో ఇష్టారీతిగా పర్సెంటేజీ ఇచ్చిన వైద్యులు
సింగరాయకొండ/హనుమంతునిపాడు/ ముండ్లమూరు:
అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయని కూటమి ప్రభుత్వం ఉన్న పింఛన్లను మాత్రం ఇష్టం వచ్చినట్లు తొలగిస్తోంది. ముఖ్యంగా నడవడానికి వీల్లేకుండా, కాళ్లు, చేతులు వంకరపోయి ఏ పనిచేసుకోలేని వారి పింఛన్లను సైతం రీ వెరిఫికేన్ పేరుతో నిర్ధాక్షిణ్యింగా తొలగించారు. దీంతో దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారు. వైద్యులు ఇష్టం వచ్చినట్లు పరీక్షించి మా కొడుపులు కొట్టాని మండిపడుతున్నారు. దివ్యాంగుల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంపై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సింగరాయకొండలో 108 పింఛన్లు
తొలగించాపు
సింగరాయకొండ మండలంలో 908 మంది దివ్యాంగ పింఛన్‌దారులు, 54 మంది ఆరోగ్య పింఛన్‌దారులు ఉన్నారు. ఇటీవల రీ వెరిఫికేషన్‌లో 131 మంది దివ్యాంగులను అనర్హులుగా గుర్తించినట్లు ప్రకటించారు. ఈ 131 మందిలో 108 పింఛన్లు రద్దు చేసి, మళ్లీ అప్పీల్ చేసుకోవాలని చెప్పారు. మిగిలిన 23 మందిలో 16 మందికి దివ్యాంగుల కోటాలో రూ.6 వేలు వస్తుండగా వారిని రూ.4వేలు ఇచ్చే వృద్ధాప్య పింఛన్‌దారులుగా మార్చారు. మరో ఏడుగురిని ఆరోగ్య పింఛన్ల కింద రూ.15 వేలు ఇస్తుండగా వారిని రూ.4 వేల వృద్ధాప్య పింఛన్లలోకి మార్చారు.
ఇష్టారాజ్యంగా పరీక్షలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల వికలాంగత్వం రీ వెరిఫికేషన్ చేపట్టింది. అయితే వైద్యులు ఇష్టం వచ్చినట్లు పరీక్షలు చేసి తక్కువ పర్సంటేజీలు ఇవ్వడంతో ఎంతో మంది అర్హులకు అన్యాయం జరిగింది. కనీసం వికలాంగులమన్న కనికరం కూడా లేకుండా రీ వెరిఫికేషన్ రోజుల తరబడి తిప్పుకున్నారని దివ్యాంగులు వాపోతున్నారు.
● హనుమంతునిపాడు మండలంలో 467 దివ్యాంగ పింఛన్లు ఉన్నాయి. వాటిలో 67 మందికి పింఛన్లు తొలగించినట్లు నోటీసులు జారీ చేశారు. 10 ఏళ్ల నుంచి తీసుకుంటున్న దివ్యాంగులు ఉన్నారు. పింఛన్లు తొలగించిన వారిలో చేతులు, కాళ్లు వంకరపోయి కనీసం నడవలేని వారే ఉన్నారు. వారి పింఛన్లను వికలాంగత్వం తక్కువ ఉందన్న సాకుతో తొలగించారు. ఏ పనిచేయలేని మా పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి మా నోటికాడి కూడు తీశారని కన్నీరుమున్నీరవుతున్నారు.
● ముండ్లమూరు మండలంలో సుమారు 160 మంది దివ్యాంగుల పింఛన్లు తొలగించారు. దీంతో బాధితులంతా బుధవారం ఎంపీడీఓ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వైద్యులు ఇష్టం వచ్చినట్లు పరీక్ష చేసి పర్సంటేజీలు తగ్గించి రాసి అన్యాయంగా మా పెన్షన్లు తొలగించారని గోడు వెళ్లబోసుకున్నారు. అయినా అధికారులెవ్వరూ పట్టించుకోలేదు. దీంతో కలెక్టర్‌ను కలిసి విన్నవిస్తామని, అక్కడ న్యాయం జరగకపోతే ఆందోళన బాట పడతామని స్పష్టం చేశారు.
ఒక్కో మండలానికి 100కు పైగా రద్దు
కదల్లేని వారి పింఛన్లు కూడా
తొలగించడంపై సర్వత్రా విమర్శలు
పింఛన్ల అప్పీల్‌కు మండల
కార్యాయాలకు దివ్యాంగులు
దివ్యాంగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. కనీసం నడవడానికి వీల్లేని వారి పింఛన్లను సైతం రీ వెరిఫికేషన్ పేరుతో తొలగించింది.
ఫలితంగా ఒక్క సింగరాయకొండ
మండలంలోనే 108 మంది దివ్యాంగుల పింఛన్లను రద్దు చేశారు. రీ వెరిఫికేషన్‌లో వైద్యులు ఇష్టారీతిన పర్సంటేజీలు
ఇవ్వడంతో పదేళ్లుగా పింఛన్లు
తీసుకుంటున్న దివ్యాంగులను కూడా అనర్హులుగా తేల్చి పింఛన్లు రద్దు చేయడంపై సర్వత్రా విమర్శలు
వ్యక్తమవుతున్నాయి.
పీసీపల్లి మండలం పాలేటిపల్లి గ్రామానికి చెందిన నారపురెడ్డి రమణమ్మ నడుములకు సర్జరీ అనంతరం మంచానికి పరిమితమైంది. ఐదేళ్ల క్రితం సదరంలో వైద్యులు పరీక్షించి 69 పర్సెంటేజీతో సర్టిఫికెట్ ఇవ్వగా పెన్షన్ డబ్బుతోనే జీవిస్తోంది. వెరిఫికేషన్ నెపంతో ఆమె పెన్షన్ పీకేసిన ప్రభుత్వం.. పునఃపరిశీలనకు ఎంపీడీఓకు అర్జీ పెట్టుకోవాలని నోటీస్ ఇచ్చింది. రానూపోను సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఆటో బాడిగ రూ.1000 కట్టాలని, అంత స్థోమత తనకు లేదని రమణమ్మ వాపోతోంది. – పీసీపల్లి