
నల్లమలలో గుప్త నిధుల తవ్వకాలు
యర్రగొండపాలెం: నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. యర్రగొండపాలెం మండలం గంజివారిపల్లె రేంజ్ పరిధిలో చెన్నుపల్లికి సమీపంలో వెలసిన వీరులోడు స్వామి కుంట వద్ద కొందరు వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి తర్వాత గుప్త నిధుల కోసం జేసీబీతో తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న రేంజ్ ఇన్‌చార్జి అధికారి ప్రసన్న జ్యోతి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ షేక్.కరీముల్లా తమ సిబ్బందితో దాడి చేశారు. అధికారుల రాకను పసిగట్టిన దుండగులు కొందరు అక్కడి నుంచి పరారు కాగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఉపయోగించిన జీప్, జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను విచారిస్తున్నామని, పరారైన వ్యక్తులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఫారెస్ట్ సెక్షన్ అధికారి తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువ ఉందని, వాటి బారిన పడి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.
జేసీబీ, జీప్‌ను స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు
పట్టుబడిన ఇద్దరు నిందితులు.. పరారీలో మరికొందరు

నల్లమలలో గుప్త నిధుల తవ్వకాలు