
నా కడుపు కొట్టారు..
నా కళ్లు పనిచేయవు. 2011లో సదరం సర్టిఫికెట్‌లో 77 శాతం వికలాంగత్వం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నాం. ఇటీవల రీ వెరిఫికేషన్‌లో వైద్యులు 46 శాతం వికలాంగత్వం ఉన్నట్లు ఇచ్చారు. నేను కాలికి బూటు వేసుకుంటే గానీ పైకి లెగవలేను. బూటు కొనుక్కోవాలంటే రూ.78 వేలు ఖర్చవుతుంది. వీటిని కేంద్రంగా ఉచితంగా ఇస్తుంది. 46 శాతం పర్సంటేజీ ఇవ్వడం వల్ల ప్రభుత్వ పథకాలు వర్తించవు. నా పింఛన్ తొలగించి నా కడుపు కొట్టారు.
–కొచ్చెర్ల లక్ష్మి, దివ్యాంగురాలు, ఊళ్లపాలెం