
నాన్న ఆశయాలు కొనసాగిస్తా..
చీమకుర్తి: తన తండ్రి చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాలు కొనసాగిస్తానని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. తన తల్లి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో పాటు వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, బూచేపల్లి కుటుంబ సభ్యులు, నాయకులతో కలిసి దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ తమ గ్రానైట్ క్వారీ అయిన సూర్య గ్రానైట్ క్వారీలో పనిచేసే కార్మికులు, సిబ్బందికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రతి సంవత్సరం తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి జయంతి, వర్ధంతి సందర్భంగా బూచేపల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి జయంతి సందర్భంగా బూచేపల్లి ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తొలుత పాటిమీదపాలెం రోడ్డులోని బూచేపల్లి పార్కులో బూచేపల్లి సుబ్బారెడ్డి స్మారకానికి నివాళులర్పించారు. అనంతరం బూచేపల్లి కళ్యాణ మండపం వద్ద ఉన్న బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహానికి గజమాలలతో నివాళులర్పించారు. కళ్యాణ మండపంలో సూర్య గ్రానైట్ క్వారీలో పనిచేసే 500 మంది కార్మికులు, వర్కర్లు, బీవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో పనిచేసే సిబ్బందికి నూతన వస్త్రాలు అందించారు. అనంతరం 1500 మందికి అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాలలో బూచేపల్లి కుటుంబ సభ్యులతో పాటు చీమకుర్తి ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్‌బాబు, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, కౌన్సిలర్లు సోమా శేషాద్రి, పాటిబండ్ల గంగయ్య, కంజుల ప్రతాప్‌రెడ్డి, గోపురపు చంద్ర, గంగిరెడ్డి సుందరరామిరెడ్డి, మేకల యల్లయ్య, గోపిరెడ్డి ఓబుల్‌రెడ్డి, గంగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, అవ్వారు ఆదినారాయణ, పులి వెంకటరెడ్డి, పాటిబండ్ల అశ్వద్దామ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ప్రజలకు అండగా ఉంటా
బూచేపల్లి సుబ్బారెడ్డి జయంతి వేడుకల్లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి
కార్మికులు, సిబ్బందికి దుస్తుల పంపిణీ, అన్నదానం
పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ,
మాజీ మంత్రి మేరుగు నాగార్జున, నాయకులు