
అమరవీరుడు కాకుమాని
పీసీపల్లి మండలం పెదయిర్లపాడులో నిరుపేద ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించిన కాకుమాని వెంకటేశ్వరు గదర్ పార్టీ వ్యవస్థాపకులు దరిశి చెంచయ్యతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. భుక్తి కోసం, భూమికోసం, ప్రజల కోసం, మాతృదేశం కోసం అనే నినాదంతో దరిశి చెంచయ్య చేపట్టిన ఉద్యమ ప్రసంగాలకు కాకుమాని ఆకర్షితుడయ్యారు. దరిశి చెంచయ్య పిలుపుతో ఎన్నో ప్రజా ఉద్యమాలు చేశారు. అప్పట్లో కమ్యునిష్టు పార్టీ జాతీయ నాయకుడు, దివంగత మాజీ ఎంపీ గుజ్జుల యల్లమందారెడ్డి, కాకుమాని వెంకటేశ్వర్లు ఇద్దరు కలిసి దరిశి చెంచయ్యను పీసీపల్లి ప్రాంతానికి పిలిపించి సభ పెట్టించారు. అప్పటి బ్రీటిష్ పాలకులు కాకుమానిపై పలు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కమ్యునిష్టు పార్టీ ఉద్యమంలో గుజ్జుల యల్లమందారెడ్డితో కలిసి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన మరణానంతరం కమ్యూనిస్టు పార్టీ నాయకులు నేరేడుపల్లిలో 1989లో స్థూపాన్ని నిర్మించారు.