
కరపత్రాన్ని విడుదల చేస్తున్న జేవీవీ నాయకులు
ఒంగోలు టౌన్: మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మండలిలో చేసిన ప్రసంగాలు పుస్తకంగా రానుంది. ఈ నెల 21వ తేదీన గుంటూరులోని ఎన్‌జీఓ కళ్యాణ మండంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు గురువారం ఎల్బీజీ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కె.మోషేన్ రాజు హాజరవుతారని, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పుస్తకాన్ని పరిచయం చేస్తారని తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసీ్త్రయ అభివృద్ధి సదస్సు జరుగుతుందన్నారు. సదస్సులో వివిధ అంశాలపై మధురై విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ వెంకటేష్ ఆత్రేయ, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ ఏ సుబ్బరామిరెడ్డి, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గేయానంద్ ఉపన్యసిస్తారని తెలిపారు. సమావేశంలో యూటీఎఫ్ నాయకులు ఎస్.రవి, ఎస్‌కే ఖాజా హుసేన్, కె.సుబ్రహ్మణ్యం, నల్లూరి వెంకటేశ్వర్లు, జి.ఉమామహేశ్వరి, ఎస్‌వీ రంగారెడ్డి, సీహెచ్ జయప్రకాశ్, తిరుపతయ్య, మాలకొండయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు.