దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత

- - Sakshi

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌

బూచేపల్లి వెంకాయమ్మ

ఒంగోలు సెంట్రల్‌: దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తోందని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, మేయర్‌ గంగాడ సుజాత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకురాలు అర్చన అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇవ్వని కాంక్లియర్‌ ప్లాంట్‌ను సైతం ఇచ్చిన ఘనత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. దివ్యాంగులు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాలన్నారు. మేయర్‌ గంగాడ సుజాత మాట్లాడుతూ ఒంగోలులో దివ్యాంగులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సభా అధ్యక్షురాలు అర్చన, మెప్మా పీడీ రవికుమార్‌, బ్యాంక్‌ ఎల్‌డీఎం అబ్ధుల్‌ రహీమ్‌, మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీ ధనలక్ష్మిలు ఆయా శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. దివ్యాంగ సంఘ నాయకులు శ్రీనివాసరెడ్డి, రాజేంద్రలు పలు సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. పరిష్కారానికి కలెక్టర్‌ సంబంధిత శాఖ అధికారులు సూచనలు చేశారు.

ఉద్యోగ నియామక పత్రాల అందజేత

ఈ సందర్భంగా 8 మంది దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. 8 మంది దివ్యాంగులకు రూ. 52 వేల విలువైన ట్రై సైకిళ్లు, మూడు వీల్‌చైర్స్‌ అందజేశారు. మహిళల జీవనోపాధులు పెంపుదలకు దాత మైనంపాడు వాసి సౌర్యతేజ ఆయిల్‌ఫిల్లింగ్‌ స్టేషన్‌ యజమాని హరిప్రసాద్‌ రూ.35 వేల విలువైన కుట్టుమిషన్లు అందజేశారు. వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, ప్రశంశాపత్రాలు అందజేశారు.

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top