జిల్లాలో లక్షలాది మంది ప్రజలకు ప్రతి రోజూ ఒక్కొక్కరికి 55 లీటర్ల చొప్పున సురక్షితమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. అందుకోసం ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. జిల్లాలోని 11 ప్రాంతాల నుంచి తీసుకొచ్చే శాంపిల్స్ నీటిలో 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. చాలా వరకు పైపులైన్ల ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తుండగా, పైపులైన్లు లేనిచోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.