YSRCP: 2024 తర్వాత బాబు ఏమైపోతాడోనని భయమేస్తోంది: విజయసాయిరెడ్డి

YSRCP MP Vijaya Sai Reddy Special Thanks to Party Cadre - Sakshi

సాక్షి, తాడేపల్లి: జూలై 8,9 తేదీల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ప్లీనరీని సక్సెస్‌ చేసిన అందరికీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 'జనసంద్రంగా ప్లీనరీ మారటం అందరూ చూశారు. పార్టీ క్యాడర్‌లో కొత్త జోష్ వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్లీనరీ జరిగింది. అణగారిన వర్గాలు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఆర్బీకేలు, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను తెచ్చాం. ఈ విషయాల్లో ప్రపంచమే మెచ్చుకుంటుంటే చంద్రబాబు భావదారిద్రంతో విమర్శలు చేస్తున్నారు. 4 లక్షల మంది ప్లీనరీ దగ్గర, 4 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. కానీ ఆంధ్రజ్యోతి, విగ్గురాజుకి మాత్రం జనం కనపడలేదు. ఈనాడు సైతం నిజం రాయక తప్పలేదన్నారు.

చదవండి: (శభాష్ భాస్కర్‌!.. చెవిరెడ్డిని అభినందించిన సీఎం జగన్‌)

బాబు ఏమవుతాడోననే భయంగా ఉంది
చంద్రబాబుకి మెదడులో ఉండాల్సిన చిప్ వేలికి వచ్చింది. తరువాత కాలికి వస్తుంది. అల్జీమర్స్‌తో బాధ పడుతున్న బాబు 2024 తర్వాత ఏమవుతాడోననే భయంగా ఉంది. టీడీపీ మహానాడులో వైఎస్సార్‌సీపీని తిట్టడం, తొడ గొట్టడమే జరిగాయి. కానీ మా ప్లీనరీలో మేము ఏం చేశామో? ఇంకా ఏం చేయాలో చర్చించాం. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు జగన్‌ని ఎదుర్కోగలడా?. నవరత్నాలు ఎలా అమలు చేశామో ప్రజలకి తెలుసు. నవరత్నాలను విమర్శించిన వారి నవరంధ్రాలు మూసుకుపోయేలా ప్లీనరీకి జనం వచ్చారు. పవర్‌లో లేమనే బాధతో చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్లి ఒక శాడిస్టుగా మారాడు. చంద్రబాబు, ఆయన కుల మీడియా జగన్‌ని విమర్శించటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. జగన్‌ని ఎప్పుడు దించేసి చంద్రబాబును సీఎం చేద్దామా అని కుట్రలు పన్నుతున్నారు. కానీ జగన్ వెన్నుపోటుతో అధికారంలోకి రాలేదు అని విమర్శించారు.

చదవండి: (నాదంటే.. నాదే: కడప టీడీపీలో రగులుతున్న చిచ్చు)

వర్షం పడితే బాగుండని చంద్రబాబు అనుకున్నాడు
అమరావతి అనేది ప్రపంచంలో అతి పెద్ద స్కాం. దేనికి ఎంత ఖర్చు పెట్టాడో ఇప్పటికీ లెక్క చెప్పలేదు. నెగెటివ్ భావాలతో బాధ పడుతున్న చంద్రబాబు ఇక రిటైర్ అవటమే బెటర్. చేతగాని వాళ్లు గోబెల్స్ ప్రచారాన్ని ఎన్నుకుంటారు. జగన్ ధైర్యంగా చేసిందే చెప్పుకుంటాడు. ప్లీనరీ జరగకుండా వర్షం పడితే బాగుండని చంద్రబాబు అనుకున్నాడు. అలాంటి శాడిస్టు మనస్తత్వం చంద్రబాబుదన్నారు.

దినేష్‌ కుటుంబానికి అండగా ఉంటాం
ప్లీనరీకి వచ్చిన దినేష్ చనిపోయారు. పోయిన ప్రాణం తీసుకు రాలేకపోయినా అండగా ఉంటాం, సాయం అందిస్తాం. వేమూరు ఎమ్మెల్యే, మంత్రి మేరుగ నాగార్జున పార్టీ తరపున ఐదు లక్షలు సాయం చేస్తున్నారు. ప్లీనరీకి ఆటంకం కలగకుండా పోలీసులు బాగా పని చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా జగన్‌ని ఎన్నుకున్నాం. అంతర్గత ప్రజాస్వామ్యం లేదనటం కరెక్టు కాదు. ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరూ జగన్‌ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అది పబ్లిక్‌గానే జరిగింది' అని విజయసాయిరెడ్డి అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top