బాబు వచ్చాడు.. భవిష్యత్‌ అంధకారమే: విజయసాయిరెడ్డి | YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

బాబు వచ్చాడు.. భవిష్యత్‌ అంధకారమే: విజయసాయిరెడ్డి

Oct 31 2024 2:46 PM | Updated on Oct 31 2024 2:55 PM

YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On CBN Govt

సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ధరల పెరుగుదలతో పేద మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే, విద్యుత్ చార్జీలు పెంచేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నాడని కామెంట్స్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా.. 
బాబు వచ్చాడు.. ధరలు ఆకాశాన్నంటాయి. 
కూరగాయలు కొండెక్కి.. మాంసం ధరలు మండిపోతూ.. పప్పులు నిప్పయ్యాయి. 
ఒకదాని ధర పెరిగిందని మరోదానితో సర్దుకునే పరిస్థితి లేక ఇంటి ఖర్చు అమాంతం పెరిగిపోయింది.
పేద, మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు పట్టించుకోవడం లేదు. 
మరోవైపు సామాన్యుడిపై విద్యుత్ చార్జీలు పెంచేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నాడు. 
బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటి నినాదం కాస్తా.. ఇప్పుడు బాబు వచ్చాడు-భవిష్యత్తు అంధకారం నినాదంగా మారిపోయింది అంటూ కామెంట్స్‌ చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement