టీడీపీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది: ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌

Ysrcp Mla Vasantha Krishna Prasad Slams Tdp Leader Devineni Uma - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ.. తెలుగు దొంగల పార్టీగా మారిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ధ్వజమెత్తారు . కొండపల్లి మైనింగ్‌పై టీడీపీ నేత పట్టాభి ఆరోపణలను ఆయన ఖండించారు. సోమవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాలను నిజం చేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 1993లో ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా 143 సర్వే నెంబర్‌పై లీజును మైనింగ్‌ శాఖ అధికారులు మంజూరు చేశారన్నారు.

1943-44లో రూపొందించిన ఆర్‌ఎస్‌ఆర్‌ రికార్డులోనూ 143 సర్వే నెంబర్‌ ఉందని,  ఎప్పటినుంచో ఉందనడానికి ఆధారాలు కూడా ఉన్నట్లు తెలిపారు. 45 ఏళ్లుగా ఆ ప్రాంతంలో మైనింగ్‌ జరుగుతుంటే, వైఎస్‌ హయాంలో 143 సర్వే నెంబర్‌ సృష్టించారని పట్టాభి ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడించారు. దేవినేని ఉమా ఏడాదిన్నరగా నాపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top