చంద్రబాబు ఓ గజదొంగ: ఎమ్మెల్యే తోపుదుర్తి | Ysrcp Mla Thopudurthi Prakash Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఓ గజదొంగ: ఎమ్మెల్యే తోపుదుర్తి

Aug 4 2023 10:50 AM | Updated on Aug 4 2023 10:52 AM

Ysrcp Mla Thopudurthi Prakash Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, అనంతపురం: చంద్రబాబు ఓ గజదొంగ అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు 40 వేల కోట్ల దోపిడీ కి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు.. చంద్రబాబు ఏరోజైనా ప్రజా సంక్షేమం కోసం ఆలోచించారా? ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. బాబు శిలాఫలాకాలు వేయడం తప్పిస్తే ఏం చేశారు?’’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రశ్నించారు.

‘‘నీ దోపిడీలు గురించి మాట్లాడితే బెదిరింపులకు దిగుతావా?. విజయ డెయిరీని చంపేసిన ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబు. సహకార వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు
సహకార వ్యవస్థను మేం గాడిన పెడుతున్నాం. చంద్రబాబు రైతుల రక్తాన్ని పీల్చిన రక్త పిశాచి. అమరావతిని రియల్‌ ఎస్టేట్‌ దందాగా మార్చావు. ఇళ్ల నిర్మాణం గురించి బాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు’’ అని మండిపడ్డారు.

జగనన్న ఇళ్ల నిర్మాణంతో పేదల కల నెరవేరుతోంది. చంద్రబాబులా పేదలను దోచుకునే అలవాటు మాకు లేదు. బాబు బినామీలతో అమరావతిలో భూములు కొనిపించారు. ప్రజలను దోచుకున్నదెవరో అందరికీ తెలుసు’’ అని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement