
తాడేపల్లి: వైయస్సార్‌సీపీ దళిత నేత వరికూటి అశోక్‌బాబుపై రేపల్లె పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. ఈ తరహా చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధం.
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో కాలువలన్నీ గుర్రపుడెక్కతో నిండిపోయి, సాగు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ, అక్కడి మా పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆందోళన చేస్తే, రేపల్లె పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అత్యంత హేయం.
రైతుల మేలు కోసం రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద బైఠాయించి అశోక్ బాబు ధర్నా చేస్తే, ఆయన పట్ల స్థానిక పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. కాళ్లు, చేతులు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లడంతో నడుం పట్టిన ఆయన ఇప్పుడు తీవ్ర అవస్థ పడుతున్నారు.
రైతుల మేలు కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా, అంత దౌర్జన్యంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబు..? అశోక్‌బాబును దారుణంగా పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లడంతో, ఆయన నడుం పట్టేసింది. దీంతో ఆయన లేవలేకపోతున్నారు. కనీసం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు.
రేపల్లెలో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా వారు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం అంటూ వైయస్సార్‌సీపీ నాయకులు మేరుగ నాగార్జున, టీజేఆర్ సుధాకర్‌బాబు, జూపూడి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.