‘ఒకే ఫ్రేమ్‌లో ఇన్ని వేరియేషన్లా?’ | YSRCP Leader Sailajanath Takes On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘ఒకే ఫ్రేమ్‌లో ఇన్ని వేరియేషన్లా?’

Jun 27 2026 6:59 PM | Updated on Jun 27 2026 7:34 PM

YSRCP Leader Sailajanath Takes On Pawan Kalyan

తాడేపల్లి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌వి అవకాశవాద రాజకీయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత శైలజానాథ్‌ ధ్వజమెత్తారు. ఇచ్చినమాట మీద నిలబడలేని వ్యక్తి పవన్‌ అంటూ మండిపడ్డారు. సంక్షేమ పథకాలపై పవన్‌ విమర్శలు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు శైలజానాథ్‌. 

ఈరోజు(శనివారం, జూన్‌ 27వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్‌.. నేడు సంక్షేమ పథకాలను విమర్శిస్తున్న పవన్‌ కళ్యాణ్‌కు ఆనాడు(ఎన్నికలకు ముందు) సంతకాలు పెట్టిన బాండ్లు పంపిణీ చేసినప్పుడు తెలియదా? అంటూ నిలదీశారు. ఒకే ఫ్రేమ్‌లో ఇన్ని వేరియేష‌న్స్ చూపించే నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప్ప ప్ర‌పంచంలో ఇంకెవ‌రూ లేరని విమర్శించారు. 

‘ త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు సుమ‌తి అనే ప‌ద్యాన్ని బాగా వంట పట్టించుకున్నాడ‌నిపిస్తోంది. వైఎస్సార్‌సీపీకి పవన్‌తోనే కాదు.. ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఇచ్చిన మాట మీద ఏ ఒక్క క్ష‌ణం కూడా నిల‌బ‌డని నాయకుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. నాయ‌కుడు మాట మీద నిల‌బ‌డ‌క‌పోతే నిల‌బెట్టాల్సిన బాధ్య‌త అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌లదే. స‌మాజంలో విష సంస్కృతిని పెంపొందించే మాట‌ల‌తో రెచ్చిపోతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ యువ‌త‌ని పెడ‌దోవ ప‌ట్టిస్తున్నాడు. 

సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసినంత మాత్రాన ఎన్నిక‌ల్లో గెలవ‌లేమ‌ని చెప్పే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల్లో 143 హామీలు ఎందుకిచ్చారు?, ప్ర‌భుత్వ భూములు 99 పైస‌ల‌కు ఇస్తుంటే, మెడిక‌ల్ కాలేజీలు, పోర్టులు ప్రైవేటుప‌రం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?, రెడ్‌బుక్ పాలనలో శాంతిభ‌ద్ర‌త‌లు గాడిత‌ప్పితే బాధితుల‌ను నిందితులుగా మార్చి వేధిస్తుంటూ మాట్లాడ‌కూడ‌దా?, ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌ని చెప్పుకునే ప‌వ‌న్ కళ్యాణ్‌.. పోలీసుల దాష్టీకాల‌కు ఎందుకు స‌మాధానం చెప్ప‌డం లేదు?, పవన్ కళ్యాణ్‌కి సంధి ప్రేలాపణలు ఎక్కువయ్యాయి. రెండు సీట్లలో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి మా గురించి మాట్లాడే హక్కు లేదు. రాష్ట్రంలోని సంపదనంతా దోచుకుంటున్నారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలు, పోర్టులను కూడా అమ్ముకోవడం సిగ్గుచేటు. ఏపీలోని శాంతిభద్రతల గురించి పక్క రాష్ట్రాల్లో దారుణంగా చెప్పుకుంటున్నారు

సాయికృష్ణను హతమార్చి బూడిద కూడా ఇవ్వని ప్రభుత్వం ఇది.  చివరికి హైకోర్టును కూడా తప్పుదారి పట్టించిన ఘనత కూటమి ప్రభుత్వంది. తిరుమల లడ్డూపై రచ్చ చేసి దుర్గమ్మ గుడి మెట్లు కడిగిన వ్యక్తి పవన్. కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం పవన్ కళ్యాణ్‌కి అలవాటు. కాపులంతా ఓట్లేస్తే సీఎం అవుతానన్న పవన్.. ఇప్పుడు తనకు కుల భావన లేదంటున్నారు. ఆయన నటన, మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement