‘సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది’ | YSRCP Leader Jupudi Slams Chandrababu Sarkar | Sakshi
Sakshi News home page

‘సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది’

Jul 3 2025 5:35 PM | Updated on Jul 3 2025 5:56 PM

YSRCP Leader Jupudi Slams Chandrababu Sarkar

విశాఖ: హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు

‘శవరాజకీయాలపై పేటెంట్‌ హక్కు చంద్రబాబుది.  సింగయ్య భార్య వాస్తవాలు చెప్పింది. అంబులెన్స్‌లో నా భర్తకు ఏదో జరిగిందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సింగయ్య భార్యను లోకేష్‌ మనుషులు ఎందుకు బెదిరించారు. వైఎస్‌ జగన్‌ను చూసి పాలక పక్షం భయపడుతోంది. ఏఐ ద్వారా జగన్‌పై తప్పుడు ప్రచారం చేశారు. 

తండ్రీ కొడులు ఇద్దరూ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి పిచ్చెక్కిపోతున్నారు. కూటమికి ఓటు వేసి ప్రజలు మోసపోయారు..షరతులు పెట్టి తల్లికి వందనం కట్ చేశారు.. పురుగులు పట్టిన అన్నం విద్యార్థులకు పెడుతున్నారు. హోమ్ మంత్రి అనిత చేసిన భోజనంలో బొద్దింక వచ్చింది. బొద్దింక ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి.’ అని జూపూడి డిమాండ్‌ చేశారు.


 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement