
సాక్షి, హైదరాబాద్: కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం అంటూ వైఎస్ షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరాశోభన్ ఆరోపించారు. కరోన కట్టడి అంశంలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆమె ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టకుండా.. జనాలందరూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలిని ఉచిత సలహాలా ఇవ్వడం ఏంటని ఆమె ప్రశ్నించారు. పక్కరాష్ట్రాల్లో పేషెంట్ల బిల్లులు కడుతున్నారని చెప్పడం సిగ్గుచేటు.. ఏపీలో కరోనా, బ్లాక్ ఫంగస్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చలేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రైవేట్‌లో టెస్టులు ఎందుకు చేయించుకున్నారో ప్రజలకు చెప్పాలని ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు.
హైకోర్టు అంక్షింతలు వేసినా ప్రైవేట్ ఆస్ప్రతుల ధరలను రెగ్యులేట్ చేయరా అని ఇందిరా శోభన్ మండిపడ్డారు . నాలుగు రోజులుగా టీకా ప్రక్రియ నిలిచిపోయిందని అన్నారు. టీకాల లెక్కల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తేడా ఎందుకు వస్తుందో చెప్పాలని, అందుబాటులో వున్న వ్యాక్సిన్ల పూర్తిగా వినియోగించాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు.