కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు

Who Will be Karnataka CM What DK Shivakumar Said To Reporters - Sakshi

బెంగళూరు: కర్ణాటక సీఎం ఎవర్నరది పార్టీ హైకమాండ్‌ నిర్ణయిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివ కుమార్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అధిష్టానానికి నిర్ణయాన్ని వదిలేశానని తెలిపారు. తాను చేయాల్సినదంతా చేశానని పేర్కొన్నారు. ఈరోజు(మే 15) తన పుట్టినరోజు అని, అనేక కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందన్నారు. నేడు ఢిల్లీ పర్యటన విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఢిల్లీ వెళ్తానో లేదో తెలీదని చెప్పారు. 

సోనియా గాంధీ తనకు బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తుందో లేదో తెలియదని శివకుమార్‌ పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీ, సోనియా గాంధీ విధేయుడనని తెలిపారు. తనపై బీజేపీ అక్రమ కేసులు పెట్టి ఇరికించినప్పుడు సోనియా నాతో ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తన మీద నమ్మకంతో సోనియా గాంధీ పీసీసీ చీఫ్‌ చేశారని అన్నారు. జనం తనను నమ్మి 130 సీట్లు ఇచ్చారని, ఇంతకంటే బర్త్‌డే గిఫ్ట్‌ ఏముంటుంది? అని పేర్కొన్నారు.
చదవండి: కర్ణాటక ఫలితం.. తెలంగాణలో ఇప్పుడెలా?.. బీజేపీ బేజార్‌, 'కారు'కు ఫియర్..

కాగా 135 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నుంచి విడివిడిగా అభిప్రాయాలు సేకరించారు ఏఐసీసీ పరిశీలకులు. బెంగుళూరు నుంచి ఢిల్లీ బయల్దేరారు. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకొని ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ అధ్యక్షుడికి సుశీల్‌ కుమార్‌ షిండే బృందం తెలియజేయనుంది. రాహుల్, సోనియా గాంధీలను సంప్రదించిన తర్వాత హై కమాండ్ నిర్ణయం తీసుకోనుంది. అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు హై కమాండ్‌ సీఎం సీటు షేరింగ్ ఫార్ములా సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

ఇక కర్ణాటకలో కాంగ్రెస్‌ 135 స్థానాలను గెలుచుకొని ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. గురువారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా సీఎం విషయంపై సస్పెన్స్‌నెలకొంది. ముఖ్యమంత్రి  కుర్చీ కోసం అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎవరూ సీఎం అవుతారనే విషయం కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. 
చదవండి: 16 ఓట్లతో గెలుపు తారుమారు..  కన్నీటి పర్యంతమైన సౌమ్యారెడ్డి  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top