What if UP becomes Kerala?.. యోగీ వ్యాఖ్యలపై పినరయి విజయన్ గట్టి కౌంటర్

తిరువనంతపురం: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వేళ యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. యూపీ కేరళలాగా మారిపోతుందని యోగి భయపడుతున్నాడని యూపీ సీఎంకు పినరయి విజయన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా ఉత్తరరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 58 స్థానాలకు జరిగిన ఎన్నికల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఓటర్లందరూ ఎన్నికల్లో పాల్గొనాలని, ఓటు వేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. లేకుంటే ఉత్తరప్రదేశ్ కూడా మరో కశ్మీర్, బెంగాల్, కేరళల మారుతుందని హెచ్చరించారు.
చదవండి: యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. లఖీంపూర్ నిందితుడికి బెయిల్
తాజాగా యోగి వ్యాఖ్యలపై కేరళ సీఎం తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ‘ఒక వేళ యూపీ కేరళలాగా మారితే మంచి విద్య యూపీ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, ప్రజలకు మెరుగైన వైద్యం లభిస్తుందని, కులాలు, మతాల పేరుతో హత్యలు జరగవని అన్నారు. ఈ మేరకు ట్విటర్‌ల్ ‘యూపీ ఒకవేళ కేరళగా మారుతుందని యోగి భయపడుతున్నారు. మంచి విద్య ప్రజలకు దక్కుతుంది. మంచి వైద్యం, సాంఘిక సంక్షేమం అందుబాటులోకి వస్తుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరగవుతాయి. మత సామరస్యం పెరుగుతుంది. ఒకరినొకరు మతాల పేరుతో చంపుకోరు. ఇదే యూపీ ప్రజలు కోరుకుంటున్నారు’ అంటూ సీఎం పినరయ్ విజయన్ ట్వీట్ చేశారు.
చదవండి: ప్రధాని మోదీపై టీఆర్‌ఎస్ ప్రివిలేజ్ మోషన్