
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా టీడీపీ నేతల దౌర్జన్య కాండపై వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. పులివెందులలో భారీ రిర్గింగ్ జరిగిందని ఎంపీ అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు, టీడీపీ గూండాలు కలిసి రిగ్గింగ్‌లకు పాల్పడ్డారన్నారు. తమ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లో లేకుండా చేశారని, బయట నుంచి వేలాది మంది టీడీపీ గూండాలను తెచ్చారన్నారు. ఈ ఉప ఎన్నికలను బర్తర్‌ప్ చేయాలని అవినాష్ డిమాండ్ చేశారు.
పులివెందులపై పోలీసులు పగబట్టారని మండిపడ్డారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, పోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారన్నారు. ఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండని, అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొందామని అవినాష్ పేర్కొన్నారు. టీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై కుట్రలు చేశారని, ఇంత చెత్త, ఘోరమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. కేంద్ర బలగాలతో రీపొలింగ్ నిర్వహించాలన్నారు.
అవినాష్‌తో అచ్చివెల్లి గ్రామస్తులు
పులివెందుల ఉప ఎన్నికలో భాగంగా అచ్చివెల్లి గ్రామస్తులు ఎంపీ అవినాష్‌రెడ్డిని కలిశారు. తమను ఓటువు వేయనీయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారని, ఏజెంట్లుగా కూర్చున్న మహిళలను బెదిరించారన్నారు. కత్తులు, కర్రలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చారని, పోలింగ్ కేంద్రాల నుంచి మహిళా ఏజెంట్లు వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారన్నారు. వచ్చిన వారంతా ఇతర ప్రాంతాల నుంచి తమ గ్రామంలోకి వచ్చిన వారేని వారు ఎంపీ అవినాష్‌కు తెలిపారు.
తమ గ్రామంలో 600 ఓట్లకు గాను 300 మంది గూండాలను మోహరించారన్నారు. తమ ఓటు హక్కును అడ్డుకునే అధికారం టీడీపీ నేతలకు ఎవరిచ్చారన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి దౌర్జన్యాఉ జరగలేదని, మహిళలను కూడా చూడకుండా తమను బూతులు తిట్టారని, చంపుతామని బెదిరించారరని అచ్చివెల్లి గ్రామస్తులు ఎంపీ అవినాష్‌కు స్పష్టం చేశారు.