రాములమ్మ దారెటు...? 

Vijayashanthis latest tweet is now a hot topic - Sakshi

తాజా ట్వీట్‌ నేపథ్యంలో చర్చ

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి తాజాగా చేసిన సుదీర్ఘ ట్వీట్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం..గుర్తింపు దక్కడం లేదంటూ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆమె ఇకపై ఏం చేస్తారో అన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోనియాను అభిమానిస్తామని ఇటీవల విజయశాంతి చేసిన ట్వీ ట్‌తో అసలు ఆమె బీజేపీలో ఉంటారా? లే దా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

‘బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడగొట్టగలిగే అభ్యర్థిని గెలిపించి లేదా గెలుపు వరకు తెచ్చిన ఓటర్లు తమ ఓటు చీలకుండా, మూడోపార్టీ ప్రధాన పోటీలో లేకపోతే జాతీయపార్టీ అయినా డిపాజిట్‌ రాని స్థాయికి ఈ పార్టీలను గతంలో పరిమితం చేశారని అదే తెలంగాణ జనశ్రేణుల విచక్షణ అంటూ’ఎక్స్‌ (ట్విటర్‌)వేదికగా ట్వీట్‌ చేశారు. ఇదే అంశంపై ‘బీఆర్‌ఎస్‌ను గద్దె దింపాల నుకునే విపక్ష పార్టీలు..ఆ ప్రజావిశ్వాసాన్ని తమ వైపు తిప్పుకునే ప్రజాస్వామ్య పోరాటానికి పెద్దఎత్తున సన్నద్ధులవుతారని తెలంగాణ ఎదురుచూస్తోందని..ప్రజల నుంచి అందు తున్న సమాచారంగా నా తోటి తెలంగాణ ఉద్యమకారులు తెలుసుకుంటున్నట్టు అభిప్రాయపడుతున్నారంటూ’సుదీర్ఘ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇది తెగింపుల సంగ్రామం. ‘తెలంగాణ ఉద్యమకారుల తిరుగుబాటులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మ రో సార్వత్రిక స్వతంత్ర పోరాటం. తెలంగాణబిడ్డలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ బరువు దించుకోడానికి సన్నద్ధమయ్యారు. ఆ ఫలితాలే దు బ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్, టీచర్స్‌ ఎమ్మె ల్సీ, హు జూరాబాద్, దగ్గరదగ్గరగా మును గోడు, నాగార్జునసాగర్‌ మొదలైనవి ఉన్నాయంటూ’ ట్వీట్‌ ప్రారంభంలో పేర్కొన్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యం లభించడం లేదనే అసంతృప్తితో ఆమె ఉన్నట్టు సమాచారం. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top