
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. ప్యాకేజీలు ఇవ్వడమన్నా, తీసుకోవడమన్నా బాబు గారికి ఎక్కడలేని ఇది. స్పెషల్ స్టేటస్ వస్తే దక్కేది 3,500 కోట్లే, ప్యాకేజీ అయితే 25 వేల కోట్లు వచ్చి పడతాయని నాలుక మడతేసి రాష్ట్రానికి పంగనామాలు పెట్టాడు. ఇప్పుడేమో అబ్బెబ్బే... ప్యాకేజి మాటే ఎత్తలేదని బుకాయిస్తున్నాడు' అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ('యువ సీఎం పాలనకు ఇంతకంటే ఏం కావాలి')
ప్యాకేజీలు ఇవ్వడమన్నా, తీసుకోవడమన్నా బాబు గారికి ఎక్కడలేని ఇది. స్పెషల్ స్టేటస్ వస్తే దక్కేది 3,500 కోట్లే, ప్యాకేజీ అయితే 25 వేల కోట్లు వచ్చి పడతాయని నాలుక మడతేసి రాష్ట్రానికి పంగనామాలు పెట్టాడు. ఇప్పుడేమో అబ్బెబ్బే...ప్యాకేజి మాటే ఎత్తలేదని బుకాయిస్తున్నాడు. pic.twitter.com/l0iwYNRFLB
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2020