Breadcrumb
Live Updates
యూపీలో నాలుగో దశ పోలింగ్ ముగిసింది
యూపీ: సాయంత్రం 5 గంటల వరకు 57.45 శాతం పోలింగ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ శాతం.. సాయంత్రం 5 గంటల వరకు 57.45 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
యూపీ: మధ్యాహ్నం 3 గంటల వరకు 49.89 శాతం పోలింగ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ శాతం.. మధ్యాహ్నం 3 గంటల వరకు 37.45 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
యూపీ: మధ్యాహ్నం 1 గంటల వరకు 37.45 శాతం పోలింగ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మాధ్యాహ్నం 1 గంటల వరకు 37.45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
మీరు బ్యాలెట్ బాక్స్‌ను మాత్రమే చూడగలరు, ప్రజల జీవితాలు కాదు: ప్రధాని ఫైర్
ఉత్తరప్రదేశ్ ప్రజలు బీజేపీతో ఉన్నారని అది స్పష్టంగా తెలుస్తోందని బారాబంకిలో జరిగిన మెగా ర్యాలీలో ప్రధాని తెలిపారు. ట్రిపుల్ తలాక్ కు సంబంధించి విపక్షాలపై ప్రధాని మోదీ విరుచుకుపడుతూ.. మీరు బ్యాలెట్ బాక్స్‌ను మాత్రమే చూడగలరు, ప్రజల జీవితాలను కాదని’ ధ్వజమెత్తారు.
Mood of Uttar Pradesh is clear. It is with the BJP. Addressing a mega rally in Barabanki. https://t.co/4QnxyevdrY
— Narendra Modi (@narendramodi) February 23, 2022
లఖింపూర్ ఖేరీలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెనీ
హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీ కుమారుడు లఖింపూర్ ఖేరీ హింసాకాండకు సంబంధించి అరెస్టయిన సంగతి తెలిసిందే. బుధవారం యూపీలో నాల్గవ దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అజయ్ మిశ్రా ఓటు వేసిన తర్వాత, లఖింపూర్ ఖేరీలోని బన్బీర్పూర్లోని పోలింగ్ బూత్ నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు భద్రతా సిబ్బంది మంత్రిని పూలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్తున్నారు.
#WATCH | MoS Home Ajay Mishra Teni leaves from a polling booth in Banbirpur of Lakhimpur Kheri, after casting his vote for the fourth phase of #UttarPradeshElections2022 pic.twitter.com/kgRpdoC9GP— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 23, 2022
ఉదయం 11 గంటల వరకు 22.41% ఓటింగ్ నమోదు
బుధవారం నాలుగో దశ పోలింగ్‌లో ఉదయం 11 గంటల వరకు 22.41 శాతం ఓటింగ్ నమోదైంది.
ఉన్నావ్: 22.45%, ఫతేపూర్: 22.41%
బీజేపీ డబుల్ సెంచరీ.. పాత రికార్డులు తిరగరాయబోతోంది: యూపీ డిప్యూటీ సీఎం
ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ లక్నోలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 4వ దశ ఎన్నికల తర్వాత బీజేపీ డబుల్ సెంచరీ కొడుతుందని, గత రికార్డులను బద్దలు కొట్టేందుకు ముందుకు సాగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు చేసిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరి ఇంటికి చేరాయని ఆయన అన్నారు.
లక్నోలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి, బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్ లక్నోలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ చరిత్రను పునరావృతం చేయడమే కాకుండా ఈసారి సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అన్నారు.
యూపీ నాలుగో దశ పోలింగ్: ఉదయం 9 గంటల వరకు 9.1% ఓటింగ్ నమోదైంది
యూపీ నాలుగో దశ పోలింగ్‌లో ఉదయం 9 గంటల వరకు 9.1 శాతం ఓటింగ్ నమోదైంది.
బండ - 8.79
ఫతేపూర్ 0.69
హర్డోయ్ 8.09
ఖిరి 10.45
లక్నో 8.19
పిలిభిత్ 10.62
రాయ్ బరేలీ - 8
సీతాపూర్ 9.52
ఉన్నావ్ 9.23
యోగి ప్రభుత్వం విఫలమైంది..నా కూతురికి జరిగింది మరెవరికి జరగకూడదు: కాంగ్రెస్ అభ్యర్థి ఆశా సింగ్
2017లో ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లి ఆశా సింగ్ యూపీ ఎన్నికల్లో ఉన్నావ్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆశా సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తన బాధను అర్థం చేసుకోవడంతో పాటు తనకు అవకాశం ఇచ్చారని అందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడుతూ.. ‘‘తన కూతురికి జరిగినది మరెవరికీ జరగకూడదని.. యోగి ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని ధ్వజమెత్తారు.
ఈ ఎన్నికల్లో 350 సీట్లు రావచ్చని భావిస్తున్నా: బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్
బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఉన్నావ్‌లోని గదన్ ఖేరా ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.."ఉన్నావ్‌లోని మొత్తం 6 స్థానాలను బీజేపీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందే సీట్ల సంఖ్య 350కి చేరుకోవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు.
ఆ పార్టీకి ఓట్లేస్తే గుండరాజ్, మాఫియా రాజ్: బీఎస్పీ అధినేత్రి మాయావతి
సమాజ్‌వాదీ పార్టీ పట్ల ముస్లింలు సంతోషంగా లేరు. ఎస్పీకి ఓటేస్తే గుండరాజ్, మాఫియా రాజ్ వస్తుందని యూపీ ప్రజలకు తెలుసు కాబట్టే వారికి ఓటు వేయరని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఎస్పీ ప్రభుత్వ హయాంలో అల్లర్లు జరిగాయని, తాము అధికారంలోకి రాలేమని ఎస్పీ నేతల ముఖాలు చెబుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.
లక్నో, రాయ్‌బరేలీలోని పలు పోలింగ్ బూత్‌లలో పనిచేయని ఈవీఎం
యూపీ అసెంబ్లీ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్‌లో.. లక్నో, రాయ్‌బరేలీలోని పలు పోలింగ్ బూత్‌లలో ఈవీఎం పనిచేయకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ ట్విట్టర్లో ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలని కోరింది.
लखनऊ जिले की 169
— Samajwadi Party (@samajwadiparty) February 23, 2022
बख्शी का तालाब विधानसभा के बूथ नंबर 122 पर ईवीएम खराब होने से मतदान बाधित।
संज्ञान लेकर शीघ्र कार्रवाई कर निष्पक्ष एवं सुचारु मतदान सुनिश्चित करे चुनाव आयोग।#UttarPradeshElections2022 @ECISVEEP @ceoup @AdminLKO
रायबरेली की 182 सरेनी विधानसभा के बूथ नंबर 348 पर ईवीएम खराब होने से मतदान बाधित।
— Samajwadi Party (@samajwadiparty) February 23, 2022
संज्ञान लेकर शीघ्र कार्रवाई कर निष्पक्ष एवं सुचारु मतदान सुनिश्चित करे चुनाव आयोग।#UttarPradeshElections2022 @ECISVEEP @ceoup
రాయ్‌బరేలీలో కాంగ్రెస్ కంచుకోట కూలనుంది: బీజేపీ అభ్యర్థి
గత ఏడాది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన రాయ్‌బరేలి ఎమ్మెల్యే అదితి సింగ్, చాలా కాలంగా కాంగ్రెస్ కంచుకోటగా పరిగణించబడుతున్న రాయ్‌బరేలీలో కాషాయ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. రాయ్‌బరేలీలో కాంగ్రెస్ భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉందా అనే ప్రశ్నపై అదితి సింగ్ మాట్లాడుతూ.. “ఖచ్చితంగా. కాంగ్రెస్ ఇక్కడ చేసిందేమి లేదు. ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా రాయ్‌బరేలీని సందర్శించలేదని, ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికలకు ముందు మాత్రమే నియోజకవర్గాన్ని సందర్శించారని అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుస్తానని అదితి సింగ్ ధీమా వ్యక్తం చేశారు
ఓటు వేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి లక్నోలోని మున్సిపల్ నర్సరీ స్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
గతంలో 59 నియోజకవర్గాల్లో 51 సొంతం.. మరి ఈ సారి ?
బుధవారం పోలింగ్ జరుగుతున్న తొమ్మిది జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాల నుంచి మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2017లో పోలింగ్ జరగిన ఈ 59 నియోజకవర్గాల్లో.. 51 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, సమాజ్‌వాదీ పార్టీ నాలుగు, మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ మూడు గెలుచుకుంది. నేడు పోలింగ్ జరుగుతున్న జిల్లాలను పరిశీలిస్తే.. గత అక్టోబర్‌లో రైతుల నిరసనల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించిన తర్వాత భారీ స్థాయిలో నిరసనలు జరిగాయి. ఈ ఘటన బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశలు ఉన్నాయి. దీంతో ప్రతిపక్షాలకు లఖింపూర్ ఖేరీ చాలా కీలకంగా మారింది.
యూపీలో నాలుగోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఉత్తర ప్రదేశ్‌లో నాలుగోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అవధ్, రోహిల్‌ఖండ్, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లోని తొమ్మిది జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ జరుగుతోంది.
ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఎస్పీ ఆశలు
ప్రభుత్వ వ్యతిరకతను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో సమాజ్‌వాదీ పార్టీ ఉంది. గో సంరక్షణలో వైఫల్యం, ఒబీసీలను యోగి చిన్నచూపు చూస్తున్నారనే ఆరోపణలు తమకు కలిసి వస్తాయని ఎస్పీ ధీమాగా ఉంది.
లఖింపూర్‌ఖేరీ హింసాకాండ ప్రభావం
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతన్నల మీదుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ వాహనం దూసుకుపోయి నలుగురు రైతన్నలు ప్రాణాలు కోల్పోవడం, తదనంతరం హింసాకాండతో అట్టుడికిపోయిన లఖీంపూర్ ఖేరి జిల్లాలో ఈసారి పోలింగ్ జరుగుతూ ఉండటంతో ఉత్కంఠగా మారింది.
కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరపై చట్టాన్ని తీసుకురాకపోవడం, లఖీంపూర్ హింసాకాండకు నైతిక బాధ్యతగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర కేబినెట్ నుంచి తప్పించకపోవడంతో ప్రజల్లో బీజేపీపై తీవ్ర ఆగ్రహం నెలకొని ఉందని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో బీజేపీకి పెట్టని కోట. గత కొన్ని దశాబ్దాలుగా లక్నోలో ఆ పార్టీయే విజయం సాధిస్తోంది. ఈసారి పౌరసత్వ సవరణ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు పట్టణ ప్రాంతంలో పార్టీ విజయావకాశాలను దెబ్బ తీస్తాయనే అంచనాలున్నాయి. రాయ్‌బరేలి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ బీజేపీ గూటికి చేరుకొని ఆ పార్టీ తరఫున పోటీకి దిగడం కాంగ్రెస్‌కు దెబ్బే.
యూపీలో నాలుగో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నాలుగో దశ పోలింగ్ అన్ని పార్టీలకు అత్యంత కీలకంగా మారింది. అధికార బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలకు ఈ దశ అగ్ని పరీక్షనే చెప్పాలి. అవధ్, రోహిల్‌ఖండ్, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లోని తొమ్మిది జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది.
Related News By Category
Related News By Tags
-
ఏ బిల్లునూ ఇష్టారాజ్యంగా మార్చకూడదు: ప్రియాంకా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకానికి వికసిత్ భారత్ - జీ- రామ్- జీ (గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్...
-
వరంగల్: పొలిటికల్ చిచ్చు రాజేసిన చలిమంట!
వరంగల్: చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో చలిమంట కాగుతున్న కాంగ్రెస్ కార్యకర్తల వద్దకు అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ ...
-
నో మీటింగ్స్.. నో అపాయింట్మెంట్స్.. రెండోరోజూ ఢిల్లీలోనే సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండో రోజూ ఢిల్లీలోనే ఉన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’ మహాధర్నాలో ఆయన పాల్గొన్న విషయ...
-
రంగంలోకి గులాబీ బాస్.. గేరు మార్చనున్న కారు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ఉద్యమానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ప్రత్యక్షంగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని కేసీఆర్ భావ...
-
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి షాక్
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో.. తొలి విడత పలితాలే పునరావృతం అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు కైవసం ...


