మళ్లీ మాదే అధికారం: కేటీఆర్‌ | TS Elections 2023: KTR Reacts On Exit Poll Surveys | Sakshi
Sakshi News home page

మళ్లీ మాదే అధికారం: కేటీఆర్‌

Nov 30 2023 6:22 PM | Updated on Nov 30 2023 7:21 PM

TS Elections 2023: KTR Reacts On Exit Poll Surveys  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎగ్జిట్‌ పోల్స్‌ చూడి కార్యకర్తలు కంగారు పడొవద్దని.. మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సేనని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం(నవంబర్‌ 30)  సాయంత్రం పోలింగ్‌ ముగిసి.. ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి నేతలు, కార్యకర్తలు కంగారు పడొద్దు. ఈ తరహా ఎగ్జిట్‌ పోల్స్‌ను గతంలోనూ చూశాం. ఎగ్జిట్‌పోల్స్‌ పేరిట న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఇంకా పోలింగ్‌ కొనసాగుతోంది.  క్యూ లైన్‌లో చాలామందే ఉన్నారు. ఓటింగ్‌ కచ్చితంగా ప్రభావితం అవుతుంది. అసలైన ఫలితం డిసెంబర్‌ 3వ తేదీన రాబోతోంది.  70కిపైగా స్థానాలు దక్కించుకుంటాం. బీఆర్‌ఎస్‌ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. హ్యాట్రిక్‌ కొట్టి.. కేసీఆర్‌ సీఎంగా ప్రమాణం చేస్తారు అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement