
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనప్ప అనుచరుడు నరేందర్‌గౌడ్‌కు సంబంధించిన ఫోన్‌కాల్ ఆడియో హాట్‌టాపిక్‌గా మారింది. ఆదిలాబాద్‌లో జరిగే బీఎస్పీ మీటింగ్‌కు ఎవరు వెళ్లొద్దని స్థానిక వ్యాపారి శ్రీకాంత్‌కు ఆయన హెచ్చరికలు జారీ చేశాడు. తన ఆదేశాలు దిక్కరించి మీటింగ్ వెళ్లితే తోక్కుడే ఉంటుందని బెదిరిస్తూ ఫోన్‌లో మాట్లాడాడు. ప్రస్తుతం ఈ ఫోన్‌కాల్ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..!
ఇప్పటివరకు తమ పార్టీలో ఉన్న అర్షద్ రాజీనామా చేసి బీఎస్పీలో చేరడానికి సిద్ధమయ్యాడని, అతనితో పాటు ఆ పార్టీలో చేరడానికి ఎవరు వెళ్లవద్దని నరేందర్ గౌడ్ బెదిరింపులకు దిగాడు. ఒకవేళ తమ ఆదేశాలు దిక్కరించి అర్షద్‌తో పాటు బీఎస్పీ సమావేశానికి వెళ్లితే పరేషాన్‌లో పడతారని హెచ్చరించారు.
చదవండి: CM KCR Tour: అడుగడుగునా పలకరింపులు.. ఆలింగనాలు