చినజీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు

Tridandi Chinna Jeeyar Swamy Sensational Comments On Temple Attacks In Andhra Pradesh - Sakshi

అమరావతి​: రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతన్న దాడులపై త్రిదండి చినజీయర్ స్వామి స్పందించారు. విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడుల మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే ఈ దాడులు వివిధ రకాల దురుద్దేశాలతో జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నవారిని దించడానికి దుష్టశక్తులు ఇలాంటి కుట్రలకు పాల్పడి ఉండవచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విగ్రహాల ధ్వంసానికి కనిపించని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిన పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్వామి ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలో ఈ అలజడిని తగ్గించేందుకే తాను ఆలయాల సందర్శన చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఆలయాల్లో విగ్రహాల స్థితిగతులు, సౌకర్యాలపై ప్రభుత్వానికి సలహాలు ఇస్తానని వివరించారు. దేవాలయాల సంరక్షణ బాధ్యతను ప్రజలు కూడా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో భక్తి భావం పెరిగినప్పుడే ఆలయాల సంరక్షణ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆలయమైనా, మసీదైనా, చర్చి అయనా దాడులు సరికాదని, ఇటువంటి విధ్వంసాలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని వారు తమకిష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు ఉందని స్వామి అభిప్రాయపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top