కాంగ్రెస్‌ భిక్షతో ఎదిగినవాళ్లే వెన్నుపోటు పొడిచారు.. రేవంత్‌ షాకింగ్‌ కామెంట్స్‌

TPCC Revanth Reddy Shocking Comments On Congress Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలతో తెలంగాణలో పాలిటిక్స్‌ పీక్‌ స్టేజ్‌కు వెళ్లాయి. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీల నేతల మధ్య దూరం స్పష్టం బహిర్గతం అవుతోంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

కాగా, తెలంగాణలోని కాంగ్రెస్‌ శ్రేణులకు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని టీఆర్‌ఎస్‌, బీజేపీ చూస్తున్నాయి. దుష్టశక్తులన్నీ ఏకమై మనల్ని ఒంటరిని చేయాలని చూస్తున్నాయి. కాంగ్రెస్‌ భిక్షతో ఎదిగినవాళ్లే వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్‌ ఏం పాపం చేసిందని ఇన్ని కుట్రలు చేస్తున్నారు. నిఖార్సైన కాంగ్రెస్‌వాదులు మునుగోడుకు కదిలిరండి.

మునుగోడును కేవలం ఒక ఉప ఎన్నికగానే చూడలేము. మునుగోడు ఉప​ ఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పార్టీలు అడుగడునా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. పవిత్రమైన యాదాద్రిని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చడమే దీనికి పరాకాష్ట. మునుగోడు ఆడబిడ్డ అని కూడా చూడకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులకు తెగబడ్డారు. మన కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్చేష్టులుగా ఉందామా?. తెలంగాణ నలుమూలల నుండి కాంగ్రెస్‌ శ్రేణులు తరలిరండి. మునుగోడులో కాంగ్రెస్‌ జెండా ఎగురవేద్దాం అని పిలుపునిచ్చారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top