
సాక్షి, హైదరాబాద్: ‘ట్విట్టర్ పిట్టకు నిన్న మెట్‌పల్లిలో చెరుకు రైతులు, నేడు సిరిసిల్లలో వీఆర్‌ఏల సెగ, మొన్న భద్రాచలంలో సీఎం కేసీఆర్‌కు వరద బాధితుల నిరసన తగిలిందని’.. అంటూ ట్విట్టర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక తండ్రీకొడుకులు జనం మధ్య స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, బంగారు తెలంగాణ క్షేత్రంలో వాస్తవ పరిస్థితి ఇదని ట్విట్టర్‌లో ఆయన విమర్శించారు.