‘8న పార్లమెంట్‌ ముట్టడిస్తాం’

Telangana: R Krishnaiah Announced Chalo Delhi Program Will Be Held On 8th - Sakshi

ముషీరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణన చేయాలని, అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 8న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ప్రకటించారు. గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సాకు చెందిన ముఖ్య బీసీ నాయకుల సమావేశం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జకృష్ణ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా చలో ఢిల్లీ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే డిసెంబర్‌ 10న అన్ని ప్రతిపక్ష నాయకులు, బీసీ నాయకులతో అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశం జరుపుతామని తెలిపారు. కులగణన జరపాలని 8 రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాలు చేశాయని, 16 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయని గుర్తుచేశారు.  రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింప చేయా లని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జాతీయ కన్వీనర్‌ గుజ్జకృష్ణ తదితరులు మాట్లాడారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top