Telangana Ministest KTR Counter To BJP Bandi Sanjay - Sakshi
Sakshi News home page

ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా.. సంజయ్‌ ట్వీట్‌కు కేటీఆర్‌ కౌంటర్‌

Oct 9 2022 8:49 AM | Updated on Oct 9 2022 11:01 AM

Telangana Ministest KTR Counter To BJP Bandi Sanjay - Sakshi

పిచ్చిముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో; మతిలేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు. ఎర్రగడ్డలో బెడ్‌ తయారుగా ఉంది.

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ‘కేసీఆర్‌ ఫాంహౌస్‌లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసిండు. పూజల అనంతరం కాళేశ్వరం పోయి వాటిని ఆ నీళ్లలో కలిపిండు. పైకి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళుతున్నానని చెప్పిండు’అని సంజయ్‌ శనివారం ట్విట్టర్‌ వేదికగా కామెంట్‌ చేయగా ఆయనను ఎద్దేవా చేస్తూ కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు.

‘ఈ లవంగంగారిని ఇలాగే వదిలెయ్యకండి రా, బీజేపీ బాబులూ.. పిచ్చిముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో; మతిలేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు. ఎర్రగడ్డలో బెడ్‌ తయారుగా ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి’అని ఎద్దేవా చేస్తూ కేటీఆర్‌ తెలుగులో ట్వీట్‌ చేశారు.

బోడిగుండులు తెలంగాణకా..? 
గుజరాత్‌లో కోకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సెంటర్‌ను కేంద్రమంత్రి తోమర్‌ ప్రారంభిస్తున్నట్లు ఓ ఆంగ్లపత్రికలో వచ్చిన వార్తను ట్యాగ్‌ చేస్తూ మంత్రి కేటీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘బోర్డులు గుజరాత్‌కు, బోడిగుండులు తెలంగాణకా? మోదీ గుండెల్లో గుజరాత్, తెలంగాణ గుండెల్లో గునపాలా? ఎన్నాళ్లీ దగా..? ఇంకెన్నాళ్లీ మోసం..?’అంటూ ట్వీట్‌ చేశా రు. గుజరాత్‌కు మరో బోర్డు ఇచ్చి, తెలంగాణకు మరో మోసం చేశారని విమర్శించారు.
చదవండి: బీజేపీలో బిగ్‌ ట్విస్ట్‌.. ఇంఛార్జ్‌లకు ఊహించని షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement