నంద్యాల జిల్లా: నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే జయసూర్యకు నిరసన సెగ తగిలింది. పాములపాడులో ఎమ్మెల్యే జయసూర్యను నిలదీశారు స్థానికులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా పాములపాడు మండల కేంద్రంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఊహించని పరిణామం ఎదురైఐంది. పంటలు ఎండితున్నాయని రైతులు ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తాగునీరు కూడా తమకు సక్రమంగా అందడం లేదని కొత్తపల్లి రైతులు.. ఎమ్మెల్యేను నిలదీశారు.
కరువు , వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న తమ మండలానికి కనీసం గుక్కెడు త్రాగునీరు ఇవ్వలేదని వాపోయారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి జిల్లా కలెక్టర్‌కు వద్దకు వెళితే తమను పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు కొత్తపల్లి మండలం రైతులు.
కొత్తపల్లి, గువ్వలకుంట్ల, పాలెంచెరువు, బిఎన్ పాలెం, వీరాపురం, బావాపురం, లింగాపురం,శివపురం గ్రామాలకు చెరువులకు అనుసంధాన పంట కాలువలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సమావేశం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు రైతులు. ఎన్నికల సమయంలో ఓటు కోసం తమని అడుగుతారు ఆ తర్వాత రైతుల కడుపు కొడతారంటూ ఎమ్మెల్యే గిత్త జయ సూర్య, ఎంపీ బైరెడ్డి శబరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగమేశ్వరం - శివపురం ఎత్తిపోతల పథకాలు, వరదరాజ స్వామి ప్రాజెక్టు పంట కాలువలు ఉన్నా చుక్క నీరుపొలాలకు అందట్లేదని వాపోయారు. ఎంపీ, ఎమ్మెల్యేలు పదవుల్లోకి వచ్చిన మరుక్షణమే తమ మొదటి సంతకం రైతుల సాగునీటి కోసేమని పలికిన ప్రగల్భాలు ఏమయ్యాయని బహిరంగంగా విమర్శించారు రైతులు.
ఇదీ చదవండి:


