ఒకరి వెంట మరొకరు.. | Sakshi
Sakshi News home page

ఒకరి వెంట మరొకరు..

Published Thu, May 9 2024 10:30 AM

TDP Janasena Key Leaders Leaving In Party

    అమలాపురంలో టీడీపీని వీడుతున్న కీలక నేతలు 

    అదే బాటలో జనసేన నాయకులు 

    స్పందించని రెండు పార్టీల అధిష్టానాలు  

సాక్షి అమలాపురం: అమలాపురం అసెంబ్లీ పరిధిలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలలో సీనియర్లకు, కొన్ని సామాజికవర్గాల వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చివరకు పార్టీలను వీడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుమానంతో అడుగడుగునా వేధింపులకు గురి చేయడంతో వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ పార్టీల అధిష్టానాలు స్పందించకపోవడం దారుణం. జనసేనకు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జులు డీఎంఆర్‌ శేఖర్, శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడారు. వీరితో పాటు పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్‌ వెళ్లిపోయింది. వీరంతా వైఎస్సార్‌ సీపీలో చేరారు. 

ఇప్పుడు టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గానికి చెందినవారు టీడీపీని వీడుతుండడం గమనార్హం. నాయకులే కాదు, వందలాది మంది పార్టీల కార్యకర్తలు సైతం ఆ రెండు పార్టీలకు గుడ్‌బై చెబుతున్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు పరమట శ్యామ్‌ రెబల్‌గా పోటీలో నిలబడిన విషయం తెలిసిందే. వీరితో పాటు పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. పార్టీ సీనియర్‌ నేత, మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు ఏకంగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. టీడీపీ రెబల్‌ అభ్యర్థి శ్యామ్‌కు జగ్గయ్యనాయుడు మద్దతు ఉందని టీడీపీ అభ్యర్థి ఆనందరావు మద్దతుదారులు బహిరంగంగా ఆరోపిస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

జనసేన, టీడీపీలను వీడుతున్నవారిలో కాపు సామాజికవర్గం వారు అధికంగా ఉండడం విశేషం. జనసేనతో భవిష్యత్‌ లేదని తేలిపోవడంతోపాటు టీడీపీలో గుర్తింపు కరువడడంతో వారు పార్టీని వీడిపోతున్నారు. పార్టీ జిల్లా అధిష్టానం కలుగజేసుకుంటుందా? అంటే అదీ లేదు. జనసేన పారీ్టకి జిల్లాలో ఒక యంత్రాంగం అంటూ లేదు. టీడీపీలో తగువులు తీర్చాల్సిన నేతలు గొడవలు పెడుతుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు పారీ్టకి గుడ్‌బై చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేనల్లో వలసలు ఆగకపోవడంతో ఆ ప్రభావం ఫలితంపై పడుతోందని రాజకీయ విశ్లేషకుల భావన.

హేళన చేశారు 
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్నాను. ఇప్పుడు నియోజకవర్గ పెద్దలు నన్ను పట్టించుకోవడం లేదు. పైగా నా సామాజికవర్గాన్ని కించిపరుస్తూ హేళన చేశారు. ఇప్పటికి నాలుగుసార్లు పోటీ చేశారు. మీరు ఒకసారి మాత్రమే గెలిచారు. ఈసారి అల్లవరం నుంచి అవకాశం ఇవ్వాలని పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావును కోరితే మమ్మల్ని పక్కన బెట్టారు. 
– అడపా కృష్ణ ప్రసాద్, అల్లవరం మండలం. 
ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన 
టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు

ఇదేనా పార్టీ ఇచ్చే గుర్తింపు 
పార్టీ సీనియర్‌ అనే గౌరవం లేకుండా చాలా సందర్భాలలో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పార్టీ నాయకులు మమ్మల్ని అడుగడుగునా అవహేళన చేస్తున్నారు. ఇదేనా పార్టీ మాకు ఇచ్చే గుర్తింపు. పార్టీ బాధ్యులే వర్గాలు కడుతున్నారు. 
– లింగోలు వెంకన్న (పెదకాపు), జనుపల్లి మాజీ సర్పంచ్, ఆత్మ మాజీ చైర్మన్, టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడు

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా 
పార్టీలో ఎంతోమంది సీట్లు ఆశిస్తారు. వారంతా మమ్మల్ని కలిసి మద్దతు కోరతారు. అంతమాత్రాన మాకు వర్గాలు కడతారా? మా కుటుంబం టీడీపీ విజయానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. 
– నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మాజీ హోం మంత్రి చినరాజప్ప సోదరుడు

పట్టించుకోవడం లేదు 
జనసేన పార్టీ పల్లకీ మోసినా మాకు గుర్తింపు లేదు. టీడీపీ నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయి. మా సేవలకు గుర్తింపు దక్కడం లేదు. 
– మోకా బాలయోగి, మాజీ సర్పంచ్,  రెళ్లుగడ్డ, అల్లవరం మండలం

టీడీపీకి మద్దతు ఇవ్వడం తప్పు 
గ్రామంలో 1,200 పార్టీ సభ్యత్వాలు చేయించగా జనసేన పెద్దలు ఘనంగా సత్కరించారు. కానీ ఇప్పుడు నేనే పార్టీ వీడి వెళ్లాల్సి వస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు గుర్తింపు లేక జనసేనకు వచ్చాను. ఇప్పుడు అదే జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వడం చాలా తప్పు. 
– గొలకోటి వెంకటేష్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు 

అందుకే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ 
ఐదుసార్లుగా పార్టీ టిక్కెట్‌ ఆశించినా నాకు అవకాశం దక్కలేదు. ఈసారి టిక్కెట్‌ ఇవ్వలేదు సరికదా.. అడుగడుగునా నన్ను అవమానించారు. నన్ను ఎవరో ప్రభావితం చేస్తే పోటీలో ఉన్నానని తప్పుడు ప్రచారం చేశారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే వారి వద్ద నుంచి స్పందన లేదు. అందుకే స్వతంత్ర అభ్యరి్థగా నేను పోటీలో ఉన్నాను. 
– పరమట శ్యామ్, టీడీపీ రెబల్‌ అభ్యర్థి

 

Advertisement

తప్పక చదవండి

Advertisement