వికటించిన టీడీపీ పచ్చ డ్రామా.. బాబు ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌ | Sakshi
Sakshi News home page

వికటించిన టీడీపీ పచ్చ డ్రామా.. బాబు ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌

Published Sat, May 13 2023 7:11 AM

TDP Chandrababu Rythu Porubata Yatra Is Utter Flop - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజల సంక్షేమం పట్టకుండా.. దేన్నైనా రాజకీయం చేయడమే అలవాటుగా మార్చుకున్న టీడీపీ నేతలు మరోసారి పచ్చ డ్రామాకు తెరతీశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఇరగవరంల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని తడిసిన ధాన్యంతో హడావుడి చేయాలని ప్రయత్నించి అభాసుపాలయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాలతో చేపట్టిన ఈ పచ్చ డ్రామాను పోలీసులు భగ్నం చేశారు. చంద్రబాబు పర్యటించే తణుకు, ఇరగవరం మండలాల్లో ప్రతి 30 అడుగుల దూరంలో నలుగురు రైతులను టీడీపీ నేతలు ఉంచారు. వారందరికీ తలొక ఐదు కిలోలు తడిసిన ధాన్యాన్ని ఇచ్చారు. చంద్రబాబు వచి్చనప్పుడు ఆ ధాన్యం చూపించి పూర్తిగా నష్టపోయామని కన్నీరు పెట్టు­కుని చెప్పాలని వారికి కథ, స్క్రీన్‌ ప్లే అందించారు.   

తడిసిన ధాన్యంపై ఎండుగడ్డి కప్పి..  
చంద్రబాబు పర్యటించిన తణుకు, ఇరగవరంల్లో తడిసిన ధాన్యం లేకపోవడంతో పాలకొల్లు, దువ్వ మండలాల్లో  సేకరించడానికి టీడీపీ గుర్తుతో ఉన్న ఒక ట్రాక్టర్‌ను ఆ పార్టీ నేతలు నాలుగు గ్రామాల్లో తిప్పారు. అక్కడ కొంత తడిసిన ధాన్యాన్ని పోగు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా దానిపై ఎండుగండి కప్పి తణుకు మీదుగా ఇరగవరానికి ట్రాక్టర్‌ను తరలించారు. చంద్రబాబు శుక్రవారం ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్లు పర్యటించి తణుకు బహిరంగ సభలో ప్రసంగించేలా టూర్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. 

ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త మైగాపుల నాగేశ్వరరావు అలియాస్‌ నాగయ్యకు చెందిన ట్రాక్టర్‌లో తడిసిన ధాన్యాన్ని తీసుకువచ్చారు. ఇరగవరం మండలం నుంచి తణుకులో చంద్రబాబు ప్రవేశించే రోడ్డుపై ముందస్తుగా కుప్పపోసి పెట్టారు. తణుకు పోలీసులు చంద్రబాబు భద్రతలో భాగంగా ఆ రోడ్డును తనిఖీ చేశారు. ఈ క్రమంలో ‘తణు­కు రూరల్‌ మండలంలో తడిసిన ధాన్యం లేదు కదా ఇదంతా ఏంటి’ అని ట్రాక్టర్‌ యజమానిని పోలీ­సులు ప్రశి్నంచారు. టీడీపీ  నేత రాధాకృష్ణ సూచనల మేరకు దువ్వ, ఇతర ప్రాంతాల నుంచి తడిసిన ధాన్యాన్ని  తెచ్చామని   ట్రాక్టర్‌ యజమాని చెప్పాడు. తణుకు, ఇరగవరం మండలాలకు చెందిన ధాన్యం కాకపోవడంతో పోలీసులు, అక్కడే ఉన్న రైతులు ఇది సరికాదని ట్రాక్టర్‌ యజమానిని హెచ్చరించారు. దీంతో రోడ్డుపై పోసిన ధాన్యాన్ని ట్రాక్టర్‌లోకి టీడీపీ నేతలు లోడ్‌ చేశారు. ట్రాక్టర్‌కు పరి్మట్, లైసెన్స్‌ లేకపోవడంతో పోలీసులు వాహనాన్ని రవాణా శాఖాధికారులకు అప్పగించారు.   

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల సరికొత్త డ్రామా.
పోలీసులు ట్రాక్టర్‌ను పట్టుకున్నప్పుడు అదే సమయంలో అటుగా వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రైతులపై దౌర్జన్యం చేస్తారా అంటూ పోలీసులపై చిందులు తొక్కారు. ఇది ఇక్కడి ధాన్యం కాదని, ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ కుప్పలు పోయడం సరికాదని పోలీసులు రామానాయుడికి గట్టిగా చెప్పారు. దీంతో నిమ్మల అక్కడ నుంచి జారుకున్నారు.  

రైతుల నుంచి స్పందన కరువు 
బాబు యాత్రకు రైతుల నుంచి స్పందన కరువైంది.  జనాలను తరలించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నా ఫ్లాప్‌ షోగానే మిగిలింది. కనీసం పదుల సంఖ్యలో కూడా రైతులు  కనిపించలేదు. గోటేరులో ఇద్దరు టీడీపీ సానుభూతిపరులతో మాట్లాడించారు. వారిలో కూడా ఒక రైతు ‘ఎవరొచ్చినా మాకేం ఉపయోగంలేదు.. అని చెప్పి వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఖాయం

Advertisement

తప్పక చదవండి

Advertisement