ఆధారాలు చూపించండి బాబు: సజ్జల | Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Over Phone Tapping Issue | Sakshi
Sakshi News home page

ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపండి: సజ్జల

Aug 19 2020 8:38 PM | Updated on Aug 19 2020 8:41 PM

Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Over Phone Tapping Issue - Sakshi

సాక్షి, అమరావతి: తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫోన్‌ను ట్యాప్‌ చేయించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అందుకు తగిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించినట్లు తెలిపారు. ఏవైనా ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపాల్సి ఉంటుందని, ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపిస్తున్న చంద్రబాబు ఇలాంటి ఆధారాలు ఎందుకు చూపడంలేదని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్‌ చేసిన సజ్జల.. టీడీపీ హయాంలో జరిగిన తన ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన పత్రాలను షేర్‌ చేశారు. (చంద్రబాబు తీరుపై విష్ణువర్ధన్‌ రెడ్డి ఆగ్రహం)

Advertisement
 
Advertisement
Advertisement