టీడీపీ పూర్తిగా హద్దు దాటింది: సజ్జల

Sajjala Ramakrishna Reddy Press Meet Over Pattabhi Remarks On Cm Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ పార్టీ అన్ని హద్దులనూ దాటేసిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ నేతల భాష రోజురోజుకీ దిగజారిపోతుందన్నారు. ఒక అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి రాష్ట్రంలో కోట్లాదిమంది అభిమానించే సీఎం జగన్‌ను దుర్భాషలాడారని, మాట్లాడింది పట్టాభి అయితే.. మాట్లాడించింది చంద్రబాబు అని పేర్కొన్నారు. చంద్రబాబుతో చర్చించి, కేంద్ర కార్యాలయంలో కూర్చుని పట్టాభి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారన్నారు. ఇలాంటి మాట పలుమార్లు అనడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. 
చదవండి: సీఎం జగన్‌ను చంద్రబాబు ఇంచుకూడా కదపలేరు: కొడాలి నాని

ఇంత ఘోరమైన మాట్లాడిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావాలని, పట్టాభి అనుచిత వ్యాఖ్యలపైనే.. నిన్నటి రియాక్షన్‌ వచ్చిందన్నారు. పట్టాభి అనుచిత  వ్యాఖ్యలు చేయకపోతే రియాక్షన్‌ ఉండేది కాదని అన్నారు. ఇక ముందు కూడా అర్థం పర్థం లేకుండా ఇలానే తిడితే తప్పకుండా రియాక్షన్ ఉంటుందని అన్నారు. గత రెండున్నరేళ్లుగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజల్లో మంచిపేరు వచ్చిందని, అది తట్టుకోలేక ప్రజల్లోకి అబద్ధపు ప్రచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
చదవండి: పట్టాభి మాట్లాడింది తప్పని చంద్రబాబు చెప్పాలి: అంబటి

చంద్రబాబు దగ్గరుండే ఇదంతా చేయించారని మండిపడ్డారు. ప్రజల ఆగ్రహానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. పట్టాభి వాడిన భాష తాము కూడా మాట్లాడితే ఎలా ఉంటుందని, ప్రజాస్వామ్య స్పూర్తి అంటే బండ బూతులు తిట్టడమా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటిస్తున్నామన్నారు.

చదవండి: టీడీపీ బూతు వ్యాఖ్యలపై.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top