Telangana: అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌

RRR: Ts Assembly Bjp Mla Raja Singh Raghunandan Rao Rajender - Sakshi

రాజేందర్‌ గెలుపుతో అసెంబ్లీలో పెరిగిన బీజేపీ బలం

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఈటల గెలుపుతో శాసనసభలో బీజేపీ బలం మూడుకు పెరిగింది. రాజేందర్‌ గెలిస్తే ట్రిపుల్‌ ఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) అసెంబ్లీలో ఉంటారని ఆ పార్టీ అధ్య క్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యా యి.  2014 అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లలో గెలిచిన ఆపార్టీ 2018 శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసింది. గోషామహల్‌ నుంచి రాజా సింగ్‌ ఎమ్మెల్యేగా గెలవడంతో ఒక్క సీట్‌కే పరిమిత మైంది. తరువాత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు టీఆర్‌ఎస్‌పై విజ యం సాధించి అసెంబ్లీలోకి ప్రవేశించారు.

బీజేపీ లో చేరిన ఈటల శాసనసభ్యత్వానికి కూడా రాజీ నామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చింది. హోరా హోరీగా సాగిన తాజా ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ సుమారు 24 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. కమ లాపూర్‌/ హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా ఆయన గెలవ డం ఇది ఏడోసారి. దీంతో శాసనసభలో బీజేపీ బలం మూడుకు పెరిగింది. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు నేతల పేర్లు ఆంగ్ల అక్షరం ‘ఆర్‌’తోనే మొదలవుతుంది. సినీ దర్శకుడు రాజమౌళి తీస్తున్న సినిమా కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దీంతో ఆ టైటిల్‌ను ఈ ముగ్గురికి అన్వయిస్తున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top