‘టీడీపీ నాకు రూ. 10 కోట్లు ఆఫర్‌ చేసింది’

Rapaka Varaprasad Rao Sensational Comments On MLC Elections - Sakshi

రాజోలు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ తనకు రూ. 10 కోట్లు ఆఫర్‌ చేసిందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ స్పష్టం చేశారు. తన ఓటు అమ్మితే రూ. 10 కోట్లు వచ్చేదని, తన వద్ద డబ్బు ఉండి వద్దనలేదని,  ఒకసారి పరువు పోతే సమాజంలో ఉండలేమనే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పారు. 

‘ నా ఓటు కోసం నా మిత్రుడు కేఎస్‌ఎన్‌ రాజును టీడీపీ నేతలు సంప్రదించారు. అసెంబ్లీ దగ్గర కూడా టీడీపీకి ఓటేయమని ఓ రాజుగారు కోరారు. టీడీపీకి ఓటేస్తే మంచి పొజిషన్‌ ఉంటుందని చెప్పారు. సిగ్గు, శరం విడిస్తే నాకు రూ. 10 కోట్లు వచ్చేవి. ఒకసారి పరువు పోతే సమాజంలో ఉండలేం’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top