సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్‌

Rahul Gandhi Attend Surat Court To Defend Criminal Defamation Case - Sakshi

గుజరాత్‌: కాంగ్రెస్‌​ పార్టీ నేత రాహుల్‌ గాంధీ గురువారం సూరత్‌ కోర్టుకు చేరుకున్నారు. పరువు నష్టం కేసు విషయంలో రాహుల్‌ గాంధీ సూరత్‌ కోర్టులో హాజరయ్యారు. 2019లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రాహుల్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తి చేసిన సూరత్‌ బీజేపీ ఎమ్మెల్యే ఆయనపై పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ కేసు విచారణ నిమిత్తం 2019 అక్టొబర్‌లోనే మొదటి సారి రాహుల్‌ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలో ఎటువంటి తప్పులేదని కోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే.
చదవండి: పార్లమెంటరీ కమిటీ భేటీలో హైడ్రామా

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top