కేంద్రం భయపడుతోంది..: ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ శనివారం ట్విట్టర్‌లో మండిపడ్డారు. ‘మామిడి కాయలు ఎలా తినాలి ? వంటి సులువైన ప్రశ్నలకే వారు అలవాటు పడ్డారు. అందుకే ప్రజలకు సంబంధించిన పెగసస్ వివాదం, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగదల వంటి విషయాలపై చర్చకు వారు భయపడుతున్నారు’ అని ప్రియాంక ఎద్దేవా చేశారు. అయితే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన ఏ విషయంపై అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే ప్రతిపక్షాలు అనవసరమైన, సీరియస్ కాని విషయాల మీద నిరసనలు చేస్తున్నారని అన్నారు.