కాంగ్రెస్‌కు బిగ్‌ షాకిచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌

Prashant Kishor Declines Congress Offer Wont Join Party - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ బిగ్‌ షాకిచ్చారు. కాంగ్రెస్‌లో చేరాలంటూ పార్టీ అధిష్టానం అందించిన ఆఫర్‌ను పీకే నిరాకరించారు. తాను పార్టీలో చేరడం లేదని ప్రశాంత్‌ కిషోర్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ధ్రువీకరించారు. పీకే నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా కొంతకాలంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

దీనికితోడు ఇటీవల పీకే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నాయకులతో భేటీ అవ్వడంతో కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైనట్లేనని అంతా భావించారు. అంతేగాక కాంగ్రెస్‌లో చేరి బాధ్యతలు చేపట్టాలని పీకేను సోనియా గాంధీ ఆహ్వనించారు. ఈ మేరకు పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే సోనియా ప్రతిపాదనను నిర్ధ్వందంగా తిరస్కరించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top