‘పవన్‌ను చం‍ద్రబాబు దారుణంగా దెబ్బకొట్టారు’ | Posani Murali Slams On Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘పవన్‌ కల్యాణ్‌కు చం‍ద్రబాబు దెబ్బకొట్టాడు’

Published Mon, Dec 11 2023 5:08 PM | Last Updated on Thu, Dec 14 2023 11:00 AM

Posani Murali Slams On Chandrababu And Pawan Kalyan - Sakshi

విజయవాడ: చంద్రబాబు చేసేది లుచ్చా రాజకీయమని ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు సర్వనాశనం చేస్తారని, తెలంగాణలో పవన్ కల్యాణ్‌కు టీడీపీ ఓట్లేయలేదని అ‍న్నారు. పవన్ కల్యాణ్‌ అభ్యర్థులకు కమ్మ వాళ్లు ఓట్లు రాలేని విర్శించారు.  

చంద్రబాబే కమ్మ వాళ్లను ఓటెయ్యొద్దని చెప్పాడని ధ్వజమెత్తారు. పవన్‌కి ఎక్కువ ఓట్లొస్తే ఏపీలో ఎక్కువ సీట్లు అడుగుతాడని అలా చేసినట్లు తెలిపారు. అందుకే పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు దెబ్బకొట్టాడని పేర్కొన్నారు. కాపుల ఓట్లు చంద్రబాబుకి వేయిస్తానని పవన్ చెప్పడం సిగ్గుచేటని ఫైర్‌ అయ్యారు. కాపులను చంపిన చంద్రబాబుకి పవన్ మద్దతిస్తాడా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

మోడీ మూడు రాష్ట్రాల్లో గెలవగానే చంద్రబాబు వణికిపోతున్నాడని అన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో మద్దతిచ్చి బీఆర్ఎస్‌ని ఓడించాలనుకున్నాడని చెప్పారు. హైదరాబాద్‌లో చంద్రబాబు వల్లే కాంగ్రెస్‌కి ఒక్క సీటు రాలేదని మండిపడ్డారు. చంద్రబాబుని హైదరాబాద్‌లోని సెటిలర్లంతా చీ కొట్టారని అన్నారు.  చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ మళ్లీ మోసం చేయడానికి ఏపీ ప్రజలు అమాయకులు కాదని  పోసాని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఎదురుతన్నిన చంద్రబాబు దుష్ప్రచారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement