Posani Krishna Murali Fires On Pawan Kalyan Comments On Volunteer - Sakshi
Sakshi News home page

పవన్‌కు ఎథిక్స్‌ ఉంటే వలంటీర్లకు క్షమాపణ చెప్పాలి: పోసాని

Jul 12 2023 12:02 PM | Updated on Jul 12 2023 1:21 PM

Posani Krishna Murali Fires On Pawan Kalyan - Sakshi

వలంటీర్లను పవన్‌ చాలా అసహ్యంగా మాట్లాడారని ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళీ అన్నారు.

సాక్షి, అమరావతి: వలంటీర్లను పవన్‌ చాలా అసహ్యంగా మాట్లాడారని ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళీ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఏది చెబితే పవన్‌ అది మాట్లాడతారని, సీఎం జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని దుయ్యబట్టారు.

‘‘ప్రజల గుండెల్లో ఉన్నంత కాలం సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు. పవన్‌కు ఎథిక్స్‌ ఉంటే వలంటీర్లకు క్షమాపణలు చెప్పాలి. డేటా చౌర్యం చేసింది చంద్రబాబు, లోకేష్‌లే. వలంటీర్లను తిడితే వారి కుటుంబ సభ్యులు బాధపడరా?. చంద్రబాబు ఏం చెబితే దానిపై పవన్‌ స్పందిస్తాడు. సినీ  ఇండ్రస్టీలోని ఆడవాళ్లను తిట్టిన వాళ్లపై పవన్‌ ఎందుకు స్పందించడు. భీమవరంలో  టీడీపీ వల్లే పవన్‌ ఓడిపోయాడు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు సీఎంగా జగన్‌ ఉంటారు’’ అని పోసాని పేర్కొన్నారు.
చదవండి: పవన్‌ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement