అనపర్తి, బిక్కవోలు మండలాల్లో హైటెన్షన్‌ | Political Conflicts Between Suryanarayana Reddy And Ramakrishna Reddy | Sakshi
Sakshi News home page

అనపర్తి, బిక్కవోలు మండలాల్లో హైటెన్షన్‌

Dec 23 2020 10:31 AM | Updated on Dec 23 2020 4:32 PM

Political Conflicts Between Suryanarayana Reddy And Ramakrishna Reddy - Sakshi

తూర్పు గోదావరి : జిల్లాలోని అనపర్తి, బిక్కవోలు మండలాల్లో పొలిటికల్ హైటెన్షన్‌ నెలకొంది. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య మరోసారి రాజకీయ విబేధాలు భగ్గుమన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇరు మండలాల్లో 144 సెక్షన్  అమలు చేయనున్నారు. రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జరిగిన  అవినీతి చిట్టాను బయటపెడతానని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఆయన అవినీతిని రుజువు చేసేందుకు తనతో పాటు సాక్షులుతో  సత్యప్రమాణాలు చేయించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో  నేడు బిక్కవోలు వినాయక గుడి లో మధ్యాహ్నం 2.30గంటలకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తన భార్య తో కలసి సత్యప్రమాణం చేయనున్నారు. ఇదే సమయంలో రామకృష్ణారెడ్డి కూడా సతీ సమేతంగా అదే గుడిలో సత్యప్రమాణానికి సిద్ధమయ్యారు. దీంతో అక్కడ ఏం జరగనుందనే దానిపై రాజకీయ వర్గాల్లో హైటెన్షన్‌ నెలకొంది. కాగా ఇరు వర్గాలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement