2023లోనూ టీఆర్‌ఎస్‌దే విజయం: ఎమ్మెల్సీగా పల్లా ప్రమాణం

Palla Rajeshwar Reddy Sworn As Telangana Graduate MLC - Sakshi

ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్‌ భూపాల్‌ రెడ్డి

అనంతరం పల్లాకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శుభాకాంక్షలు

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి గురువారం పల్లాతో ప్రమాణ స్వీకారం చేయించారు. మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత ఉత్కంఠ రేపిన ఎన్నికల ఫలితాల్లో చివరకు పల్లా విజయం సాధించారు. ప్రమాణం అనంతరం రాజేశ్వర్‌రెడ్డిని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్‌ 

ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మార్చిలో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భారతదేశ చరిత్రలో 72 మంది పోటీ చేయగా రికార్డు మెజారిటీతో పట్టభద్రులు తనను గెలిపించారని తెలిపారు. 10 లక్షల మంది ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచిన చరిత్ర సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. 2023లో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో నేరాలు తగ్గాయని చెప్పారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన సంఘటన దురదృష్టకరమని తెలిపారు. దుర్మార్గుడు రాజు తనకు తాను శిక్ష విధించుకున్నాడని, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదదని స్పష్టం చేశారు.
చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top