‘కొండపల్లి మున్సిపాలిటీపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలి’ | NTR District: Jogi Ramesh Leads YSRCPs High Level Review Meeting | Sakshi
Sakshi News home page

‘కొండపల్లి మున్సిపాలిటీపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలి’

Aug 28 2026 7:52 PM | Updated on Aug 28 2026 8:10 PM

NTR District: Jogi Ramesh Leads YSRCPs High Level Review Meeting

విజయవాడ: కొండపల్లి మున్సిపాలిటీపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి జోగి రమేష్‌ స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉందని, ఇప్పట్నుంచీ వైఎస్సార్‌సీపీ విజయం కోసం కృషి చేయాలన్నారు. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 28వ తేదీ) జోగి రమేష్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. 

దీనిలో భాగంగా జోగి రమేష్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ చేసిన అభివృద్ధిని ప్రతీ గడపకు తీసుకెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుందన్నారు. 

‘మున్సిపల్ ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. జగన్ చేసిన అభివృద్ధిని ప్రతీ గడపకు తీసుకెళ్లాలి. కొండపల్లి మున్సిపాలిటీలో 40 వార్డులను గెలిచితీరుతాం. కొండపల్లి మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలి. సమన్వయ కమిటీ ఆధ్వర్యంలోనే అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుంది. కొండపల్లి మున్సిపాలిటీలో విజయాన్ని సాధించి జగనన్నకు కానుకగా ఇవ్వాలి’ అని పార్టీ శ్రేణులకు సూచించారు. 

ఇదీ చదవండి: 
‘చంద్రబాబు చేసిందేమైనా ఉంటే ఆధారాలతో చూపించగలరా?’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement